వివాదంలో చిక్కుకున్న ‘జాట్’ మూవీ !

బాలీవుడ్ సీనియర్ హీరో సన్నీ డియోల్ ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం జాట్. తెలుగు దర్శకుడు గోపిచంద్ మలినేని దర్శకత్వంలో ఏప్రిల్ 10న విడుదలై థియేటర్లలో విజయవంతంగా ప్రదర్శితమవుతోంది ఈ సినిమా. అయితే, ఈ చిత్రం ఇప్పుడు ఒక పెద్ద వివాదంలో చిక్కుకుంది. కారణం .. ఇందులో యల్టీటీఈ ని ఉగ్రవాద సంస్థగా చూపించడం.
సోషల్ మీడియాలో ఇప్పుడు బోయ్ కాట్ జాట్ మూవీ అనే హ్యాష్‌ట్యాగ్ ట్రెండ్ అవుతోంది. ఎందుకంటే, ఈ సినిమాలో శ్రీలంకలో తమిళుల హక్కుల కోసం పోరాడిన ‘లిబరేషన్ టైగర్స్ ఆఫ్ తమిళ్ ఈలం’ ను ఉగ్రవాద సంస్థగా చూపించడం ఏంటని ఆవేశంగా స్పందిస్తున్నారు నెటిజన్స్.
"నేనొక తమిళుడ్ని. జాట్ సినిమాలో యల్టీటీఈ ని ఉగ్రవాద సంస్థగా చూపించడం చాలా తప్పు. శ్రీలంకలోని మా జాతిని అణచివేసే విధంగా జరిగిన హింస, సంక్షోభం మధ్య యల్టీటీఈ ఏర్పడింది. మా చరిత్రను మీకిష్టమైనట్టు వక్రీకరించకండి. అని ఒక నెటిజెన్ స్పందించాడు.
‘‘యల్టీటీఈ ఉగ్రవాద సంస్థ కాదు. అది ఓ ప్రతిఘటన సంఘం. దళితుల మీద జరిగిన దురాగతాలకు, నిర్మూలన ప్రయత్నాలకు వ్యతిరేకంగా నిలబడిన పోరాట శక్తి. ‘జాట్’ సినిమాలో ఈ ఉద్యమాన్ని దుర్మార్గంగా చూపించడం తల్లడిల్లే అంశం. చరిత్రను తప్పుడు రూపంలో చూపితే, మేము మౌనంగా ఉండం..’’ అని వేరొక నెటిజెన్ రియాక్టయ్యాడు.
ఇదిలా ఉండగా.. ఈ వివాదంపై ఇప్పటివరకు చిత్ర బృందం నుంచి ఎటువంటి స్పందన రాలేదు. ఈ సినిమాలో బాలీవుడ్ నటుడు రణదీప్ హుడా శ్రీలంక విలన్ పాత్రలో రణతుంగగా కనిపించాడు. ఈ పరిస్థితుల్లో చిత్రం కథనాలపై ప్రజా స్పందన తీవ్రతరం అవుతోంది. తమిళుల చరిత్రను అపహాస్యం చేయడాన్ని పలు వర్గాలు తీవ్రంగా ఖండిస్తున్నాయి.
-
Home
-
Menu