అది నా ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీసింది : ఇషా తల్వార్

అది నా ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీసింది : ఇషా తల్వార్
X
37 ఏళ్ల ఇషా.. ఇటీవలే సినీ రంగంలో 13 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. తన జర్నీని గుర్తు చేసుకుంటూ.. ఇషా ఒక ఆందోళనకరమైన జ్ఞాపకాన్ని పంచుకుంది.

తన నటనా జీవితాన్ని నితిన్ నటించిన "గుండె జారి గల్లంతయ్యిందె", "రాజా చెయ్యి వేస్తే" వంటి తెలుగు సినిమాలతో ప్రారంభించిన నటి ఇషా తల్వార్. ఇప్పుడు ఓటీటీ ప్లాట్‌ఫారమ్‌లలో ఎక్కువగా కనిపిస్తూ, బిజీగా ఉంది. తెలుగు సినిమాల్లో కొంతకాలం నటించిన తర్వాత.. ఆమె మలయాళ చిత్రాల వైపు అడుగులు వేసి, చివరికి హిందీ వెబ్ సిరీస్‌లు మరియు డ్రామాల్లో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది.

37 ఏళ్ల ఇషా.. ఇటీవలే సినీ రంగంలో 13 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. తన జర్నీని గుర్తు చేసుకుంటూ.. ఇషా ఒక ఆందోళనకరమైన జ్ఞాపకాన్ని పంచుకుంది. అది తన ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీసిందని చెప్పింది. బాలీవుడ్‌లో అత్యంత ప్రభావవంతమైన కాస్టింగ్ డైరెక్టర్ షానూ శర్మతో జరిగిన ఒక అసౌకర్య అనుభవాన్ని ఆమె గుర్తు చేసుకుంది. షానూ శర్మ ఒకసారి ఆమెను ఒక రెస్టారెంట్‌లో.. జనం మధ్యలో ఏడుపు సీన్ చేయమని అడిగిందట.

"నటిగా నాకు ఎలాంటి అడ్డంకులూ ఉండకూడదని.. అందుకే షానూ, ఆమె అసిస్టెంట్ల ముందు ఏడుపు సీన్ చేయాలని చెప్పారు. ఇది చాలా గందరగోళంగా, వింతగా అనిపించింది.." అని ఆమె ఒక సోషల్ మీడియా పోస్ట్‌ కామెంట్‌లో రాసింది. "చిన్న వయసులో సినిమాల్లో ఉన్న నా ఆత్మవిశ్వాసాన్ని ఇది బద్దలు చేసింది. ఒక సీనియర్ కాస్టింగ్ డైరెక్టర్ ఒక యువ నటిని ఇలాంటి పరిస్థితిలో ఎందుకు పెట్టాల్సి వచ్చిందో నాకు అర్థం కాలేదు.

నటులకు సరైన కాస్టింగ్ ఆఫీస్ స్పేస్‌లో ఆడిషన్ ఇవ్వడం న్యాయం. లేదా నీకు రియల్ లొకేషన్ కావాలంటే, ఒక స్పాట్‌ను అద్దెకు తీసుకుని, దానికి డబ్బు చెల్లించి ఆడిషన్ చేయాలి..."ఇషా తల్వార్ హిట్ వెబ్ సిరీస్ ‘మిర్జాపూర్‌’ లో తన అద్భుతమైన నటనతో ఆకట్టుకుంది. ప్రస్తుతం ఆమె ఒక కొత్త షోలో నటిస్తోంది.

Tags

Next Story