నాగార్జున నన్ను 14 సార్లు చెంపదెబ్బ కొట్టారు : ఇషా కొప్పికర్

ఈ తరం యువతలో చాలామందికి 1990 ల చివరలో, 2000ల ప్రారంభంలో ఇషా కొప్పికర్ ఎంత పాపులర్ అనేది తెలియకపోవచ్చు. బాలీవుడ్‌తో పాటు ఆమె సౌత్ ఇండియన్ సినిమాల్లోనూ నటించింది. అందులో ఒకటి తెలుగు సినిమా “చంద్రలేఖ”. ఈ సినిమా మలయాళ రీమేక్. కృష్ణవంశీ దర్శకత్వంలో నాగార్జున హీరోగా తెరకెక్కింది. తాజాగా ఒక ఇంటర్వ్యూలో ఇషా ఈ సినిమా గురించి మాట్లాడుతూ ఓ ఆసక్తికర సంఘటనను పంచుకుంది. “నాగార్జున నన్ను కొట్టారు,” అంటూ ఓ తీవ్రమైన సన్నివేశాన్ని గుర్తుచేసుకుంది.
“నేను పూర్తిగా అంకితభావంతో నటించే నటిని, నిజమైన మెథడ్ యాక్టింగ్ చేయాలనుకున్నాను,” అని చెప్పింది. ఒక ఎమోషనల్ సీన్‌లో కోపాన్ని చూపించాల్సి వచ్చినప్పుడు, ఆమెకు సరైన భావోద్వేగాలు పలకలేదు. పాత్రలో లీనమవ్వడానికి ఆమె ఓ వింత నిర్ణయం తీసుకుంది. నాగార్జునను తనను నిజంగా చెంపదెబ్బ కొట్టమని కోరింది.
“నన్ను గట్టిగా కొట్టమని చెప్పినప్పుడు ఆయన షాక్ అయ్యారు. ‘నీకు ఖచ్చితంగా అలాగే కావాలా?’ అని అడిగారు. కానీ నేను పట్టుబట్టాను. ఆ క్షణంలో ఉండాలంటే అది అవసరం. చివరికి అతను నన్ను 14 సార్లు కొట్టారు..” అని నవ్వుతూ చెప్పింది. సన్నివేశం పూర్తయ్యేసరికి ఇషా మొహంపై చెంపదెబ్బ గుర్తులు కనిపించాయి. “నా మొహంపై గుర్తులు స్పష్టంగా కనిపించాయి,” అని చెప్పిన ఆమె.. నాగార్జున తర్వాత అపరాధ భావంతో ఫీల్ అయ్యరని కూడా తెలిపింది.
-
Home
-
Menu