ఇమ్రాన్ హష్మి సరికొత్త మిషన్ ‘గ్రౌండ్ జీరో’ !

ఇమ్రాన్ హష్మి సరికొత్త మిషన్ ‘గ్రౌండ్ జీరో’ !
X
ఏప్రిల్ 25న థియేటర్లలో విడుదల కానున్న ఈ సినిమా గురించి మేకర్స్ ప్రకటిస్తూ, "కశ్మీర్‌ను శాశ్వతంగా మార్చిన ఓ మిషన్‌ వెనుకున్న తెలియని కథ" అంటూ క్యాప్షన్ ఇచ్చారు.

బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హష్మి తాజా చిత్రం ‘గ్రౌండ్ జీరో’ విడుదలకు సిద్ధమవుతోంది. తాజాగా చిత్ర బృందం అఫిషియల్ అనౌన్స్‌మెంట్ చేస్తూ.. హష్మి పవర్‌ఫుల్ లుక్‌తో ఉన్న కొత్త పోస్టర్‌ను విడుదల చేసింది. తేజస్ దియోస్కర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం.. ఇమ్రాన్ కెరీర్‌లో మరొక కీలక చిత్రం కానుంది. ఏప్రిల్ 25న థియేటర్లలో విడుదల కానున్న ఈ సినిమా గురించి మేకర్స్ ప్రకటిస్తూ, "కశ్మీర్‌ను శాశ్వతంగా మార్చిన ఓ మిషన్‌ వెనుకున్న తెలియని కథ" అంటూ క్యాప్షన్ ఇచ్చారు.

విడుదలైన పోస్టర్‌లో ఇమ్రాన్ హష్మి వెనుక నుంచి కనిపిస్తూ.. చేతితో గన్ పట్టుకొని నిలబడి ఉన్నాడు. అతని ఎదురుగా అందమైన కశ్మీర్ దృశ్యాలు కనిపిస్తున్నాయి. ఈ చిత్రంలో ఇమ్రాన్ హష్మి.. బీఎఫ్ యస్ డెప్యూటీ కమాండెంట్ నరేంద్ర నాథ్ దుబే పాత్రలో కనిపించనున్నారు. జాతీయ భద్రతకు ముప్పుగా మారిన ఓ సీరియస్ కేసును రెండు సంవత్సరాలపాటు విచారణ చేస్తూ, ఓ మిషన్‌ను విజయవంతంగా పూర్తి చేసిన కథ ఆధారంగా ఈ సినిమా రూపొందుతోంది. నిజ ఘటనల ప్రేరణతో తెరకెక్కిన ఈ సినిమా, ప్రేక్షకులను థ్రిల్‌కు గురిచేసే యాక్షన్, ఎమోషనల్ డ్రామా మిశ్రమంగా ఉంటుందని చిత్రబృందం చెబుతోంది.

ఈ సినిమాను ఎక్సెల్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై రితేశ్ సిధ్వాని మరియు ఫర్హాన్ అక్తర్ నిర్మిస్తున్నారు. ఇందులో సాయి తమ్హంకర్ ముఖ్య పాత్రలో నటిస్తున్నారు. గతంలో ఇమ్రాన్ హష్మి... సల్మాన్ ఖాన్ నటించిన ‘టైగర్ 3’ లో ప్రతినాయకుడు ఆతిష్ రెహ్మాన్ గా కనిపించాడు. ప్రస్తుతం అతడు ‘గూడాచారి 2’, ‘అవారపన్ 2’ చిత్రాలతో బిజీగా ఉన్నాడు. ఏప్రిల్ 25న విడుదల కానున్న ‘గ్రౌండ్ జీరో’ థ్రిల్లింగ్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ప్రేక్షకుల ముందుకు రానుంది.

Tags

Next Story