యన్టీఆర్ అండ్ హృతిక్ ఐకానిక్ డ్యాన్స్ నెంబర్ !

ఇటీవల విడుదలైన "వార్ 2" సినిమా టీజర్ ప్రేక్షకుల నుండి మిశ్రమ స్పందనలను రాబట్టింది. ఈ టీజర్‌కు సంబంధించి బాలీవుడ్ మీడియా, కొంతమంది సోషల్ మీడియా యూజర్ల నుండి తీవ్రమైన ట్రోలింగ్ ఎదు ర్కొన్నప్పటికీ, ఎన్టీఆర్ అభిమానులు దీటుగా స్పందించి, ఈ విమర్శలను తిప్పికొట్టేందుకు సోషల్ మీడియాలో చురుకుగా పాల్గొన్నారు. అయినప్పటికీ, ఈ ఆన్లైన్ విమర్శలు ఎన్టీఆర్‌ను ఏమాత్రం కలవరపెట్టలేదు. తనదైన శైలిలో దృష్టిని పనిపై కేంద్రీకరిస్తూ.. ఆయన సినిమా షూటింగ్ కోసం సన్నద్ధమవుతున్నాడు. అయాన్ ముఖర్జీ తెరెక్కిస్తున్న ఈ మూవీపై భారీ అంచనాలున్నాయి.
ప్రస్తుతం ఎన్టీఆర్, బాలీవుడ్ స్టార్ హృతిక్ రోషన్‌తో కలిసి "వార్ 2" సినిమాలో ఒక భారీ డాన్స్ సీక్వెన్స్ చిత్రీకరణ కోసం సిద్ధమవుతున్నాడు. ఈ డాన్స్ నంబర్‌ను దశాబ్దంలోనే అత్యంత అద్భుతమైన మ్యూజికల్ సీక్వెన్స్‌గా తీర్చిదిద్దాలని టీమ్ భావిస్తోంది. ఇండియన్ స్ర్కీన్ పై అత్యంత ప్రతిభావంతులైన డ్యాన్సర్స్ గా పేరొందిన హృతిక్ రోషన్ అండ్ ఎన్టీఆర్‌ల కలయికలో ఈ పాటను సినిమాలో ఒక ఐకానిక్ మూమెంట్‌గా నిలిపే అవకాశం ఉంది. ఈ హై-ఎనర్జీ డాన్స్ నంబర్ సినిమా క్లైమాక్స్‌కు ముందు వస్తుంది, ఇది ప్రేక్షకులకు ఒక అద్భుతమైన విజువల్ ట్రీట్‌గా ఉండనుంది.
ఈ డాన్స్ సీక్వెన్స్‌లో 500 మందికి పైగా బ్యాక్‌గ్రౌండ్ డాన్సర్లు పాల్గొననున్నారు. ప్రముఖ ప్రొడక్షన్ డిజైనర్ అమృత మహల్ నకై ఈ సీక్వెన్స్ కోసం ఒక గ్రాండ్ సెట్‌ను రూపొందించారు. ఇది ఈ పాటకు మరింత ఆకర్షణను జోడిస్తుంది. ఈ సెట్లో జరిగే డాన్స్ సన్నివేశాలు ప్రేక్షకులను విజువల్‌గా ఆకట్టుకునేలా ఉంటాయని భావిస్తున్నారు. ఈ భారీ డాన్స్ నంబర్ చిత్రీకరణ వచ్చే నెలలో ప్రారంభం కానుంది. ప్రముఖ కొరియోగ్రాఫర్ బాస్కో మార్టిస్ ఈ సీక్వెన్స్ కోసం డాన్స్ స్టెప్స్‌ను రూపొందిస్తున్నారు. ఈ పాటకు సంగీతాన్ని ప్రీతమ్ స్వరపరిచారు, ఇది ఒక ఉర్రూతలూగించే ట్రాక్‌గా ఉండనుంది. బాస్కో మార్టిస్ మరియు ప్రీతమ్ కలయిక, హృతిక్ అండ్ ఎన్టీఆర్‌ల డ్యాన్సింగ్ టాలెంట్ ఈ పాటను అభిమానులకు ఐఫీస్ట్ గా మారనుంది.
-
Home
-
Menu