రెండు సార్లు ‘కన్నప్ప’ని తిరస్కరించాను.. అక్షయ్ కుమార్!

రెండు సార్లు ‘కన్నప్ప’ని తిరస్కరించాను.. అక్షయ్ కుమార్!
X

ముంబైలో నిర్వహించిన ప్రత్యేక ఈవెంట్‌లో ‘కన్నప్ప’ హిందీ టీజర్‌ను విడుదల చేశారు. బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్, హీరో మంచు విష్ణు, దర్శకుడు ముఖేష్ కుమార్ సింగ్ ఈ వేడుకలో సందడి చేశారు.

ఈ సంధర్భంగా అక్షయ్ కుమార్ మాట్లాడుతూ, 'మొదటగా ఈ సినిమా ఆఫర్‌ను తిరస్కరించినా, మంచు విష్ణు నమ్మకం తనను ఒప్పించిందని' తెలిపారు. 'కథలో లోతైన భావోద్వేగాలు, అద్భుతమైన విజువల్స్ ఉన్నాయి. ఈ ప్రాజెక్ట్‌లో భాగం కావడం గర్వంగా ఉంది' అన్నారు.

మంచు విష్ణు మాట్లాడుతూ, ''కన్నప్ప' నా జీవిత ప్రయాణం. ఇది భక్తి, విశ్వాసం, త్యాగానికి అంకితమైన కథ. ఇందులో అక్షయ్, మోహన్‌లాల్, ప్రభాస్ లాంటి నటుల భాగస్వామ్యం గర్వకారణం' అని చెప్పారు.

దర్శకుడు ముఖేష్ కుమార్ సింగ్ మాట్లాడుతూ , 'ఈ సినిమా విష్ణు ప్యాషన్‌కు నిదర్శనమని, ఈ విజువల్ వండర్ ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేస్తుంది' అన్నారు. ‘కన్నప్ప’ ఏప్రిల్ 25న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది.

Tags

Next Story