‘క్రిష్ 4’ మూవీపై అదిరిపోయే అప్డేట్ !

‘క్రిష్ 4’ మూవీపై అదిరిపోయే అప్డేట్ !
X
‘క్రిష్ 4’ స్క్రిప్ట్ ఇప్పటికే లాక్ అయ్యింది. ప్రస్తుతం ప్రీ-ప్రొడక్షన్ శరవేగంగా జరుగుతోంది. షూటింగ్ 2026 ప్రారంభంలో ప్రారంభించాలనే లక్ష్యంతో టీమ్ ముందుకు సాగుతోంది.

భారీ అంచనాల మధ్య ‘క్రిష్ 4’ మూవీ అనౌన్స్‌మెంట్ వచ్చింది. తాజా సమాచారం ప్రకారం.. ఈ భారీ ప్రాజెక్ట్‌ను ఆదిత్య చోప్రా నిర్మించనున్నారు. రాకేశ్ రోషన్ కూడా ఈ చిత్రానికి సహనిర్మాతగా వ్యవహరించనున్నారు. మ‌రింత ఆస‌క్తిక‌ర‌మైన విష‌యం ఏంటంటే.. ఈ చిత్రంతో హృతిక్ రోషన్ దర్శకుడిగా పరిచయం కాబోతున్నాడు. ‘క్రిష్ 4’ స్క్రిప్ట్ ఇప్పటికే లాక్ అయ్యింది. ప్రస్తుతం ప్రీ-ప్రొడక్షన్ శరవేగంగా జరుగుతోంది. షూటింగ్ 2026 ప్రారంభంలో ప్రారంభించాలనే లక్ష్యంతో టీమ్ ముందుకు సాగుతోంది.

సహనిర్మాత రాకేష్ రోషన్ మాట్లాడుతూ.. ’క్రిష్ 4’ దర్శకత్వ బాధ్యతలను నా కుమారుడు హృతిక్ రోషన్‌కు అప్పగిస్తున్నాను. ఈ ఫ్రాంచైజీ ప్రారంభమైనప్పటి నుంచి అతడు దీనికి ప్రాణంగా ఉన్నాడు. ఇప్పుడతడు.. క్రిష్ కథను మరో స్థాయికి తీసుకెళ్లే బాధ్యతను తీసుకున్నాడు. ఒక తండ్రిగా, ఒక చిత్రదర్శకుడిగా ఇది నాకు గర్వకారణం. ‘క్రిష్ 4’ ని హృతిక్ అద్భుతంగా రూపొందిస్తాడని నాకెంతో నమ్మకం ఉంది" అని అన్నారు.

ఈ భారీ బడ్జెట్ ప్రాజెక్ట్‌ను ఆదిత్య చోప్రా నిర్మించడంపై రాకేశ్ రోషన్ హర్షం వ్యక్తం చేస్తూ.. ‘క్రిష్ 4’ నిర్మాతగా ఆదిత్య చోప్రా ఉండటం నాకు ఎంతో ఆనందంగా ఉంది. హృతిక్‌ను డైరెక్షన్ చేయమని ప్రేరేపించింది కూడా ఆదిత్యనే! యశ్ రాజ్ ఫిలిమ్స్ సాంకేతికత, విజన్, అంతర్జాతీయ స్థాయి సినిమాల నిర్మాణ అనుభవం ఈ సినిమాకు మరింత విలువను జోడిస్తుంది" అన్నారు.

అలానే – "హృతిక్, ఆదిత్య చోప్రా నిర్మాత, దర్శకులుగా కలిసి పని చేయడం నిజంగా అరుదైన క్రియేటివ్ కాంబినేషన్. క్రిష్ 4 భారతీయ సినిమాను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లే అద్భుతమైన థియేట్రికల్ ఎక్స్‌పీరియెన్స్‌గా రూపొందుతుంది" అని రాకేశ్ రోషన్ విశ్వాసం వ్యక్తం చేశారు. ఇంకో ముఖ్యమైన విశేషం.. ‘కోయి మిల్ గయా’ తో ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్న ‘జాదూ’ పాత్ర మళ్లీ ‘క్రిష్ 4’లో రాబోతోంది.

Tags

Next Story