మూడు పాత్రల్లో హృతిక్ రోషన్ !

హృతిక్ రోషన్ నటించిన సూపర్‌హీరో ఫ్రాంచైజీ ‘క్రిష్’ నాలుగో భాగం ‘క్రిష్ 4’. ఇప్పటివరకు అతను చేసిన సినిమాల కంటే ఎంతో గొప్పగా రూపొందుతోంది. ఈ ప్రాజెక్టు ప్రత్యేకత ఏమిటంటే.. ఈ మూవీతో హృతిక్ రోషన్ తొలిసారిగా దర్శకత్వ బాధ్యతలు కూడా చేపడుతున్నాడు. ఈసారి కథ అంతా టైం ట్రావెల్ చుట్టూ తిరుగుతుంది. పలు టైమ్ లైన్స్ లో గతం, భవిష్యత్తు మధ్య క్రిష్ ప్రయాణిస్తూ ఒక పెద్ద ప్రమాదాన్ని నిలువరించేందుకు చేసే ప్రయత్నమే ఈ చిత్ర ప్రధాన ఇతివృత్తం. కథ ‘ఇన్ఫినిటీ వార్, ఎండ్ గేమ్’ సినిమాల నుంచి ప్రేరణ పొందిందని ఫిల్మ్ వర్గాల సమాచారం.
ఈ సినిమా అత్యాధునిక వీఎఫ్ఎక్స్, భారీ నిర్మాణ విలువలతో ముందుకు సాగుతున్నా.. కథలో కుటుంబ సంబంధాలు, భావోద్వేగాలకు విశేష ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు సమాచారం. పాత కథానాయికలు పునరాగమనం చేయనున్నారని కూడా చెబుతున్నారు. ప్రీతి జింటా, ప్రియాంక చోప్రా, వివేక్ ఒబెరాయ్, రేఖ.. ఇలా పలు ప్రముఖ పాత్రలు మళ్లీ కనిపించనున్నాయి. ఇక తాజాగా నోరా ఫతేహి కూడా ఈ ప్రాజెక్టులో భాగమవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఆమెకు ఉన్న స్టైలిష్ యాక్షన్ ఇమేజ్ దృష్ట్యా, ఆమె ఒక శక్తివంతమైన పాత్రలో, యాక్షన్ సన్నివేశాల్లో ప్రధానంగా కనిపించనున్నారని టాక్.
‘క్రిష్ 4’ కోసం స్క్రిప్ట్ చాలా మార్లు మార్చబడింది. ఇప్పుడు తుదిపాటి స్క్రిప్ట్ ఫిక్స్ అయిందని సమాచారం. హృతిక్ రోషన్, యష్ రాజ్ ఫిల్మ్స్ స్టూడియోతో కలిసి ఈ ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్తున్నారు. ఇక మరో ఆసక్తికరమైన అంశం .. హృతిక్ ఈ సినిమాలో మూడు పాత్రలు పోషించనున్నాడనే ప్రచారం జరుగుతోంది. అవే – రోహిత్, క్రిష్, ఇంకా ప్రధాన ప్రతినాయకుడు పాత్రలు. అయితే దీనిపై ఆయన బృందం స్పష్టతనివ్వకుండా, ప్రచారాలను ఖండించింది. ప్రస్తుతం హృతిక్ ‘వార్ 2 షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు. ఆ సినిమా పూర్తయిన తర్వాత వెంటనే ‘క్రిష్ 4’ పనులు మొదలవుతాయని తెలుస్తోంది. ఈ సినిమా మీద అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇండియన్ సూపర్‌హీరో ప్రపంచానికి ఇది ఓ కొత్త దిశ చూపే ప్రాజెక్ట్‌గా నిలవనుందన్న నమ్మకం టాలీవుడ్, బాలీవుడ్ వర్గాల్లో ఉంది.
-
Home
-
Menu