ఈ కాంబో నిజమేనా?

టాలీవుడ్ క్రేజీ డైరెక్టర్ బాబీ కొల్లి తన తొలి హిందీ సినిమాపై ఆసక్తికర చర్చల్లో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. తాజా సమాచారం ప్రకారం... బాబీ తన బాలీవుడ్ డెబ్యూకి సంబంధించిన మొదటి దశ చర్చలు ప్రారంభించినట్లు తెలుస్తోంది. ఇటీవలే బాబీ కోల్లి హృతిక్ రోషన్‌ను కలిసి కథ వినిపించినట్టు సమాచారం. హృతిక్ కథను ఆసక్తిగా విన్నాడని, కథ పట్ల ఆయనకు మంచి ఇంప్రెషన్ వచ్చిందని సమాచారం. అయితే ప్రాజెక్టు ఇతర వివరాలు ఇంకా ఖరారు కాలేదు. ఈ సినిమాకు మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై నిర్మాణం జరుగవచ్చని కూడా వార్తలు వస్తున్నాయి.
బాబీ కొల్లి ఎర్లియర్ గా నందమూరి బాలకృష్ణ ప్రధాన పాత్రలో నటించిన ‘దాకూ మహారాజ్’ అనే యాక్షన్ థ్రిల్లర్ సినిమాను డైరెక్ట్ చేశాడు. ఈ సినిమాలో ఓ ఐఏయస్ అధికారిగా బాలకృష్ణ ఒక గ్రామ నీటి సమస్యను పరిష్కరించేందుకు వచ్చినప్పుడు, ఆ గ్రామాన్ని కబళించిన అరాచక కుటుంబాన్ని ఎదుర్కొనే కథగా డాకూ మహారాజ్ తెరకెక్కింది. ఈ మూవీకి మంచి పేరొచ్చింది.
ఇదిలా ఉంటే, హృతిక్ రోషన్ వచ్చే ఏడాది ‘వార్ 2’ సినిమాతో తెరపైకి రానున్నాడు. ఈ యాక్షన్ థ్రిల్లర్‌ను అయాన్ ముఖర్జీ డైరెక్ట్ చేస్తున్నాడు. ఈ సినిమాలో ఎన్టీఆర్ ప్రతినాయకుడిగా నటిస్తున్నాడు. ఇది ఎన్టీఆర్‌కు వైఆర్ ఎఫ్ స్పై యూనివర్స్‌లో తొలి చిత్రం కావడం విశేషం. కియారా అద్వానీ ఈ చిత్రంలో హీరోయిన్‌గా నటిస్తోంది. మరి బాబీ కొల్లి ప్రాజెక్ట్ ఎప్పుడు పట్టాలెక్కుతుందో చూడాలి.
-
Home
-
Menu