హోంబలే వారి క్రేజీ కాంబో !

బాలీవుడ్ గ్రీక్ గాడ్ హృతిక్ రోషన్ తన రాబోయే స్పై యాక్షన్ థ్రిల్లర్ "వార్ 2"లో ఏజెంట్ కబీర్‌గా ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతున్నాడు. ఈ చిత్రంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ మరో పవర్ ఫుల్ రోల్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా స్వాతంత్ర్య దినోత్సవ వీకెండ్లో విడుదల కానుంది. "వార్ 2" తర్వాత హృతిక్ "క్రిష్ 4" పనులను ప్రారంభిస్తాడు.
తాజాగా హృతిక్ తన అభిమానులకు ఓ గుడ్ న్యూస్ అందించాడు. దక్షిణ భారతదేశంలోని అతిపెద్ద నిర్మాణ సంస్థల్లో ఒకటైన హోంబలే ఫిల్మ్స్‌తో జతకట్ట బోతున్నాడు. ఈ బ్యానర్ "కేజీఎఫ్", "కాంతార", "సలార్" వంటి భారీ పాన్-ఇండియన్ బ్లాక్బస్టర్లను నిర్మించింది. తారాగణం, సాంకేతిక బృందం వివరాలను తర్వాత వెల్లడిస్తారు. అభిమానులు ఈ భారీ చిత్రాన్ని ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించాలని కోరుకుంటున్నారు.
హోంబలే ఫిల్మ్స్ సోషల్ మీడియా పోస్ట్‌లో ఇలా పేర్కొన్నారు: "అతడిని గ్రీక్ గాడ్ అంటారు. అతడు హృదయాలను గెలుచుకున్నాడు, సరిహద్దులను ఛేదించాడు, అతడు నిజంగా ఒక విస్మయం. హృతిక్ రోషన్ ను హోంబలే కుటుంబంలోకి స్వాగతిస్తున్నందుకు మేము గర్విస్తున్నాము. ధైర్యం, వైభవం, ఘనతతో కూడిన ఒక కథ ఆవిష్కృతం కానుంది, ఇక్కడ తీవ్రత ఊహాశక్తిని కలుస్తుంది. బిగ్ బ్యాంగ్ ప్రారంభమవుతుంది." అని తెలిపారు. ఈ కాంబినేషన్ పై ప్రస్తుతం సోషల్ మీడియాలో తీవ్ర చర్చలు జరుగుతున్నాయి.
They call him the Greek God. He's ruled hearts, shattered limits and we see the phenomenon he truly is!
— Hombale Films (@hombalefilms) May 28, 2025
We are proud to welcome @iHrithik to the @hombalefilms family for a collaboration, years in the making. A tale of grit, grandeur and glory is set to unfold, where intensity… pic.twitter.com/ZU2FHKjKdm
-
Home
-
Menu