‘భూల్ చుక్ మాఫ్’ ఓటీటీ రిలీజ్ కు నో చెప్పిన హై కోర్ట్ !

‘భూల్ చుక్ మాఫ్’ ఓటీటీ రిలీజ్ కు నో చెప్పిన హై కోర్ట్  !
X
పివీఆర్‌ ఐనాక్స్‌తో ఒప్పందం ప్రకారం ఎనిమిది వారాల థియేట్రికల్‌ విండో పూర్తవకముందే సినిమా ఓటీటీలో విడుదల చేయాలన్న మాడ్డాక్‌ నిర్ణయాన్ని బాంబే హైకోర్టు తప్పుబట్టింది.

పవర్‌ఫుల్‌ కథనాలతో సినిమా ప్రేమికులను ఆకట్టుకుంటున్న మాడ్డాక్‌ ఫిలిమ్స్‌ నిర్మించిన ‘భూల్‌చుక్‌ మాఫ్‌’ సినిమా ఓటీటీ విడుదలకు సంబంధించి వివాదంలో ఇరుక్కుంది. పివీఆర్‌ ఐనాక్స్‌తో ఒప్పందం ప్రకారం ఎనిమిది వారాల థియేట్రికల్‌ విండో పూర్తవకముందే సినిమా ఓటీటీలో విడుదల చేయాలన్న మాడ్డాక్‌ నిర్ణయాన్ని బాంబే హైకోర్టు తప్పుబట్టింది. దీనిపై మధ్యంతర ఉత్తర్వులు జారీ చేస్తూ, పివీఆర్‌ సంస్థ తరఫున మాడ్డాక్‌పై వేసిన కేసులో జూన్‌ 16 వరకు మూవీని ఓటీటీలో విడుదల చేయకుండా నిలిపివేయాలంటూ ఆదేశించింది.

రాజ్‌కుమార్ రావు, వామికా గబ్బీ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా మే 16న ప్రైమ్ వీడియోలో విడుదల చేయనున్నట్టు మాడ్డాక్ ఫిలిమ్స్‌ ప్రకటించింది. దేశవ్యాప్తంగా భద్రతా పరిస్థితులు తీవ్రంగా మారడంతో థియేటర్లలో రిలీజ్‌ రద్దుచేసుకున్నామని మాడ్డాక్ ప్రకటించింది. ఏప్రిల్ 22న జరిగిన ఘోరమైన పహల్గామ్ ఉగ్రదాడి లో 26 మంది అమాయకులు ప్రాణాలు కోల్పోవడంతో దేశం మొత్తం ‘ఆపరేషన్ సింధూర్‌’ పేరుతో అప్రమత్తమైంది. ఈ నేపథ్యంలో భద్రతా ఆందోళనలు, వాణిజ్య పరమైన కారణాల వల్ల థియేటర్ విడుదలను రద్దు చేస్తున్నట్టు మాడ్డాక్ ప్రకటించింది.

అయితే, మాడ్డాక్ తీసుకున్న ఈ నిర్ణయంపై పివీఆర్ ఐనాక్స్‌ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ సినిమా ఓటీటీలో విడుదల అయితే తాము భారీగా నష్టపోతామని పేర్కొంటూ కోర్టును ఆశ్రయించింది. సినిమా ముందు థియేటర్లలో విడుదల చేసి, ఆ తరువాతే ఓటీటీకి వెళ్లాలన్న 8 వారాల హోల్డ్‌బ్యాక్‌ ఒప్పందాన్ని ఉల్లంఘించారని పివీఆర్ ఆరోపించింది. ప్రస్తుతం ఈ చిత్రం ఓటీటీలో విడుదల కాకుండా నిలిపివేయాలని మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసినప్పటికీ, మే 16న చిత్రం విడుదలపై ఇంకా స్పష్టత రాలేదు.

Tags

Next Story