అక్షయ్ కుమార్ ‘హేరా ఫేరీ 3’ మూవీకి సన్నాహాలు

అక్షయ్ కుమార్ ‘హేరా ఫేరీ 3’ మూవీకి సన్నాహాలు
X
ఈ సినిమా ఎప్పుడెప్పుడు సెట్స్ మీదకు వెళ్తుందా అనే ఆత్రుత ఎక్కువ వుతోంది. అయితే ఇప్పుడు దానికి సమయం ఆసన్నమైంది.

2000లో విడుదలైన ‘హేరా ఫేరీ’ మూవీ బాలీవుడ్‌లో ఒక కల్ట్ క్లాసిక్‌గా నిలిచి పోయింది. 2006లో వచ్చిన సీక్వెల్ "ఫిర్ హేరా ఫేరీ" కూడా మంచి విజయం సాధించింది. అక్షయ్ కుమార్, సునీల్ షెట్టి, పరేశ్ రావల్ ముఖ్యపాత్రలు పోషించిన ఈ సిపిమా మూడో భాగం కోసం ఎప్పటి నుంచో ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు. ఈ సినిమా ఎప్పుడెప్పుడు సెట్స్ మీదకు వెళ్తుందా అనే ఆత్రుత ఎక్కువ వుతోంది. అయితే ఇప్పుడు దానికి సమయం ఆసన్నమైంది.

ప్రస్తుతం అక్షయ్ కుమార్ ప్రధాన పాత్రలో ప్రియదర్శన్ "భూత్ బంగ్లా" అనే చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. ఈ సందర్భంగా అక్షయ్, ప్రియదర్శన్ 68వ పుట్టినరోజు సందర్భంగా ఓ స్పెషల్ పోస్ట్ షేర్ చేశాడు. ఆ సినిమా సెట్లో తీసుకున్న ఫోటోను షేర్ చేస్తూ.. "హ్యాపీ బర్త్‌డే ప్రియన్ సర్.. భూతాల మధ్య, మీకు రీటేక్స్ తక్కువగా ఉండేలని కోరుకుంటున్నాను అని అక్షయ్ రాశాడు. దీనికి స్పందించిన ప్రియదర్శన్.. "ధన్యవాదాలు అక్షయ్! నీకు నేను ఒక గిఫ్ట్ ఇస్తాను. ‘హేరా ఫేరీ 3’ డైరెక్ట్ చేయడానికి నేను సిద్ధం. నువ్వు రెడీనా?" అంటూ రిప్లై ఇచ్చారు.

ఈ అనౌన్స్ మెంట్ పై పలువురు స్పందించారు. సునీల్ శెట్టి, పరేశ్ రావల్ లాంటి ప్రధాన నటులు తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. పరేశ్ రావల్ రాసిన మెసేజ్ మరింత ఆసక్తికరంగా మారింది: "ప్రియదర్శన్ జీ, మీరు మా హేరా ఫేరీ కుటుంబానికి తల్లి లాంటివారు. మళ్లీ ఈ బేబీకి బాధ్యత తీసుకున్నందుకు కృతజ్ఞతలు. ఇప్పుడు ప్రపంచాన్ని మళ్లీ నవ్వించండి!" అని రాశాడు.

హేరా ఫేరీ లో హీరోయిన్ గా నటించిన టబు... హేరా ఫేరీ ఫ్రాంచైజీలో తిరిగి చేరబోతోందనే సంకేతాలను తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీ ద్వారా ఇచ్చింది. అక్షయ్ కుమార్ పంచుకున్న పోస్ట్‌ను రీషేర్ చేస్తూ, "ప్రియదర్శన్, నేను లేకుండా ఈ కాస్ట్ పూర్తి కాదు" అంటూ టబు రాసిన సందేశం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.

Tags

Next Story