రణవీర్ సింగ్ సినిమా సెట్లో ఫుడ్ పాయిజనింగ్ !

రణవీర్ సింగ్ సినిమా సెట్లో ఫుడ్ పాయిజనింగ్ !
X
షూటింగ్ సెట్ లో చిన్న అపశ్రుతి చోటు చేసుకుంది. ఫుడ్ పాయిజనింగ్ కారణంగా 100 మందికి పైగా క్రూ సభ్యులు లేహ్‌లోని ఆసుపత్రిలో చేరారు.

బాలీవుడ్ యంగ్ డైనమైట్ రణ్ వీర్ సింగ్ హీరోగా ఆదిత్య ధర్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం 'ధురంధర్'. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా సాగుతుండగా.. షూటింగ్ సెట్ లో చిన్న అపశ్రుతి చోటు చేసుకుంది. ఫుడ్ పాయిజనింగ్ కారణంగా 100 మందికి పైగా క్రూ సభ్యులు లేహ్‌లోని ఆసుపత్రిలో చేరారు. దీంతో సెట్‌లో గందరగోళం నెలకొంది. కొంతమంది తీవ్రమైన కడుపు నొప్పి, వాంతులు, తలనొప్పితో బాధపడ్డారు, దీంతో వారిని వెంటనే సజల్ నర్బు మెమోరియల్ ఆసుపత్రికి తరలించారు.

అందుతున్న సమాచారం ప్రకారం... చేరిన వారిలో కొంతమంది పిల్లలు కూడా ఉన్నారు. అయితే, ఎవరి పరిస్థితీ తీవ్రంగా లేదని, వారిలో చాలామంది ఇటీవల డిశ్చార్జ్ అయ్యారని తెలుస్తోంది. ఆసుపత్రి సీనియర్ డాక్టర్ ఒకరు ఐఏఎన్‌ఎస్‌తో మాట్లాడుతూ.. ‘‘ ఎమర్జెన్సీ వార్డులో రద్దీని నియంత్రించడానికి, గందరగోళం నివారించడానికి పోలీసులు కూడా సహకరించారు," అని చెప్పారు. ఫుడ్ సేఫ్టీ డిపార్ట్‌మెంట్ కలుషిత ఆహార కారణాన్ని కనుగొనడానికి నమూనాలను సేకరించి పరీక్షిస్తోంది.

ప్రస్తుతం చిత్రీకరణలో సుమారు 600 మంది పాల్గొంటున్నారు. కానీ కలుషిత ఆహారం కొంతమంది క్రూ సభ్యులు మాత్రమే తిన్నారని.. వారిలో చాలామంది అనారోగ్యానికి గురయ్యారని సమాచారం. దర్శకుడు అదిత్య ధర్ పరిస్థితిని స్వయంగా పర్యవేక్షిస్తున్నారని, క్రూ సభ్యులకు ఉత్తమ వైద్య సంరక్షణ అందేలా చూస్తున్నారని సమాచారం.

Tags

Next Story