‘డాన్ 3’ షూటింగ్ అప్పటి నుంచే !

బాలీవుడ్ క్రేజీ ఫ్రాంచైజీ చిత్రం ‘డాన్ 3’. ఐకానిక్ ‘డాన్’ మూవీ సిరీస్ లో ఇది మూడో భాగం. మళ్లీ వార్తల్లో నిలిచింది. ఈ సారి రణవీర్ సింగ్ షారుఖ్ ఖాన్ ఐకానిక్ రోల్‌ను టేకప్ చేస్తున్నాడు. ఫర్హాన్ అఖ్తర్ దర్శకుడిగా తిరిగి వస్తున్నాడు. తాజా సమాచారం ప్రకారం.. ఈ చిత్రం 2026 జనవరిలో షూటింగ్ ప్రారంభం కానుంది. మరింత ఆసక్తికరమైన విషయం ఏమిటంటే... గ్లోబల్ క్వీన్ ప్రియాంక చోప్రా కూడా కేస్టింగ్ లో భాగం కావచ్చనే గట్టి పుకారు ఉంది. అయితే ఇంకా ఏదీ డిసైడ్ అవలేదు.
నిజానికి ముందుగా అందాల కియారా అద్వానీని ప్రధాన పాత్ర కోసం అనౌన్స్ చేశారు. కానీ ఆమె స్థానంలో ‘వేదా’ ఫేమ్ శర్వరి రావచ్చనే ఊహాగానాలు జోరందుకున్నాయి. అయితే.. నిర్మాతల నుండి అధికారిక ధృవీకరణ ఇంకా రావలసి ఉంది. ప్రీ-ప్రొడక్షన్ పనులు ఊపందుకుంటున్న తరుణంలో అందరి దృష్టి ఇప్పుడు బృందం నుండి అధికారిక ప్రకటనలపైనే ఉంది. మరి ఈ మూడో భాగంలో డాన్ గా రణ్వీర్ సింగ్ ఎలా మెప్పి్స్తాడో చూడాలి.
-
Home
-
Menu