అవెంజర్స్: డూమ్స్‌డే’ లో విలన్ ఎవరో తెలుసా?

2019లో విడుదలైన ‘అవెంజర్స్: ఎండ్‌గేమ్’ లో టోనీ స్టార్క్ పాత్ర ముగిసినా.. రాబర్ట్ డౌనీ జూనియర్ త్వరలో మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్‌లో కొత్తగా ‘డాక్టర్ డూమ్’ అనే విలన్ పాత్రలో కనిపించనున్నారు. ఈ సినిమా జో రుస్సో, ఆంథోనీ రుస్సో దర్శకత్వంలో రూపొందుతోంది.
ఇప్పటివరకు డాక్టర్ డూమ్ ఒక ప్రత్యేకమైన పాత్రగానే కనిపిస్తున్నా.. కొంతమంది అభిమానులు అతను వేరే డైమెన్షన్‌లోని మెరుగైన ఐరన్ మాన్ వెర్షన్ కావచ్చని ఊహిస్తున్నారు. ఇప్పటివరకు మేకర్స్ ఈ విషయాన్ని ధృవీకరించకపోయినా, రాబర్ట్ డౌనీ జూనియర్ తిరిగి మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్ లో కనిపించనున్నాడనే వార్త అభిమానులను ఉత్సాహపరుస్తోంది.
‘అవెంజర్స్: డూమ్స్‌డే’ 2026 మే 1న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ చిత్రంలో టామ్ హాలండ్, క్రిస్ ఎవాన్స్, హైలీ స్టెయిన్‌ఫెల్డ్, పెడ్రో పాస్కల్, వెనెస్సా కిర్బీ, క్రిస్ హెమ్స్‌వర్త్ తదితరులు నటిస్తున్నారు. మరి విలన్ గా రాబర్ట్ డౌనీ జూనియర్ ఎలా మెప్పిస్తాడో చూడాలి.
-
Home
-
Menu