‘వార్ 2’ ఫ్యాన్స్ కు నెక్స్ట్ లెవెల్ ఫీస్ట్ ఇస్తుంది : అయాన్ ముఖర్జీ

‘వార్ 2’  ఫ్యాన్స్ కు నెక్స్ట్ లెవెల్ ఫీస్ట్ ఇస్తుంది : అయాన్ ముఖర్జీ
X
"హృతిక్ అండ్ ఎన్టీఆర్ వంటి ఇద్దరు ఐకానిక్ స్టార్స్‌ను ఒకరితో ఒకరు తలపడేలా చేసే కథను క్రాఫ్ట్ చేయడం చాలా టఫ్ టాస్క్. మేము 'వార్ 2' ని కేవలం సీక్వెల్‌గా చూడలేదు. మొదటి 'వార్' సినిమాకు నీరాజనం పట్టడంతోపాటు, ఈ ఫ్రాంచైజీని బోల్డ్‌గా కొత్త హైట్స్‌కు తీసుకెళ్లే అవకాశంగా భావించాం," అని చెప్పారు.

ఇండియన్ క్రేజీ స్టార్స్ హృతిక్ రోషన్, ఎన్టీఆర్ మధ్య ఒక థ్రిల్లింగ్ షోడౌన్‌ను ఆవిష్కరిస్తూ, యాక్షన్ సినిమాలకు కొత్త బెంచ్‌మార్క్ సెట్ చేయడానికి రెడీ అవుతోంది ‘వార్ 2’ మూవీ. అయాన్ ముఖర్జీ డైరెక్షన్‌లో, ఆదిత్య చోప్రా నిర్మాణంలో యష్ రాజ్ ఫిల్మ్స్ బ్యానర్‌పై తెరకెక్కిన ఈ హై-వోల్టేజ్ యాక్షన్ థ్రిల్లర్ .. ఆగస్టు 14న థియేటర్లలో సందడి చేయడానికి సిద్ధంగా ఉంది.

అయాన్ ముఖర్జీ.. ఈ సినిమా కథను రాసే సమయంలో ఎదురైన అతిపెద్ద సవాళ్ళ గురించి మాట్లాడుతూ.. "హృతిక్ అండ్ ఎన్టీఆర్ వంటి ఇద్దరు ఐకానిక్ స్టార్స్‌ను ఒకరితో ఒకరు తలపడేలా చేసే కథను క్రాఫ్ట్ చేయడం చాలా టఫ్ టాస్క్. మేము 'వార్ 2' ని కేవలం సీక్వెల్‌గా చూడలేదు. మొదటి 'వార్' సినిమాకు నీరాజనం పట్టడంతోపాటు, ఈ ఫ్రాంచైజీని బోల్డ్‌గా కొత్త హైట్స్‌కు తీసుకెళ్లే అవకాశంగా భావించాం," అని చెప్పారు.

"ఇంత భారీ ఫ్యాన్ బేస్ ఉన్న ఫ్రాంచైజీని కంటిన్యూ చేయడం అంటే భారీ రెస్పాన్సిబిలిటీ. మొదటి సినిమా సక్సెస్‌ను రిపీట్ చేసే ఫార్ములాతో వెళ్లడం మా ప్లాన్ కాదు. యాక్షన్ సీక్వెన్స్‌ల నుంచి ఎమోషనల్ డ్రామా వరకు ప్రతిదీ నెక్స్ట్ లెవెల్‌కు తీసుకెళ్లేలా డిజైన్ చేశాం. ఫ్యాన్స్‌ను థ్రిల్ చేయడమే కాదు, ఈ ఇద్దరు సూపర్‌స్టార్స్ అభిమానుల అంచనాలను కూడా ఎక్సీడ్ చేయాలని మా టార్గెట్," అని అయాన్ తెలిపారు.

"వార్ 2"ని భారతీయ సినిమాకు ఒక గ్రాండ్ సెలబ్రేషన్‌గా అభివర్ణిస్తూ, అయాన్ ఈ సినిమా థియేటర్లలో ఒక అన్‌ఫర్గెటబుల్ ఎక్స్‌పీరియన్స్ ఇస్తుందని ప్రామిస్ చేశారు. "హృతిక్ రోషన్, ఎన్టీఆర్ జూనియర్ లాంటి ఇద్దరు డైనమిక్ స్టార్స్‌ను ఒకే స్క్రీన్‌పై తీసుకొచ్చినప్పుడు అంచనాలు ఆకాశాన్ని తాకుతాయి. మేము ఈ సినిమా కోసం హార్ట్ అండ్ సోల్ పోసి, ప్రేక్షకులకు మైండ్‌బ్లోయింగ్ రైడ్ అందించడానికి రాత్రింబవళ్లు కష్టపడ్డాం," అని ఆయన అన్నారు.

Tags

Next Story