సీక్రెట్ గా పెళ్లిచేసుకున్న బాలీవుడ్ యంగ్ బ్యూటీ

బాలీవుడ్ యంగ్ బ్యూటీ నర్గీస్ ఫక్రీ రహస్యంగా పెళ్ళి చేసుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ప్రముఖ వ్యాపారవేత్త టోనీ బేగ్‌ను ఆమె పెళ్లి చేసుకున్నట్లు బీటౌన్ వర్గాల్లో గుసగుసలు మార్మోగుతున్నాయి. లాస్ ఏంజిల్స్‌లోని ఓ స్టార్ హోటల్‌లో గత వారాంతంలో వీరి పెళ్లి వేడుక జరిగినట్లు సమాచారం. ఈ ఆనందోత్సవానికి పరిమిత సంఖ్యలో కుటుంబ సభ్యులు మాత్రమే హాజరయ్యారు.
పెళ్లి అనంతరం నర్గీస్, టోనీ బేగ్ జంట స్విట్జర్లాండ్‌కు వెళ్ళింది. ఈ ట్రిప్‌కు సంబంధించిన ఫోటోలు నర్గీస్ సోషల్ మీడియాలో షేర్ చేయడంతో వారి వివాహ వార్తలకు మరింత బలం చేకూరింది. అయితే, పెళ్లి విషయాన్ని ఈ జంట ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. టోనీ బేగ్ కశ్మీర్‌కు చెందిన వ్యాపారవేత్త. ఆయన కుటుంబం అమెరికాలో స్థిరపడింది. 2022 నుండి తాను టోనీతో డేటింగ్‌లో ఉన్నట్లు నర్గీస్ గతంలో ఓ ఇంటర్వ్యూలో వెల్లడించింది.
కెరీర్ విషయానికొస్తే నర్గీస్.. బాలీవుడ్‌లో ‘రాక్‌స్టార్’ సినిమాతో అరంగేట్రం చేసింది. ‘కేఫ్’, ‘డిష్యుం’, ‘హౌజ్‌ఫుల్ 3’ వంటి చిత్రాల్లో నటించి ప్రేక్షకులను ఆకట్టుకుంది. తెలుగులో ‘అమావాస్య’ చిత్రంతో పరిచయమైన ఈ అందాల తార, ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటిస్తున్న ‘హరిహర వీరమల్లు’లో కీలక పాత్ర పోషిస్తోంది.
-
Home
-
Menu