‘తేరే ఇష్క్ మేన్’ లడఖ్ షెడ్యూల్ !

'రాంఝనా' చిత్రానికి సీక్వెల్‌గా రూపొందుతున్న ఆనంద్ ఎల్ రాయ్ దర్శకత్వంలోని ‘తేరే ఇష్క్ మేన్’ ప్రస్తుతం చిత్రీకరణలో ఉంది. తమిళ స్టార్ హీరో ధనుష్, అందాల కృతి సనన్ జంటగా నటిస్తున్న ఈ సినిమాపై అభిమానుల్లో ఇప్పటి నుంచే ఆసక్తి నెలకొంది. ఇప్పటికే ఢిల్లీ షెడ్యూల్‌ను పూర్తిచేసిన చిత్రబృందం, తదుపరి భాగాన్ని ఉత్తరప్రదేశ్‌లోని వారణాసిలో చిత్రీకరించింది.
ఇదే ప్రదేశంలో ధనుష్ నటించిన ‘రాంఝనా’ కూడా చిత్రీకరించిన సంగతి తెలిసిందే. తాజాగా, దర్శకుడు ఆనంద్ ఎల్ రాయ్ లడాఖ్‌లోని లేహ్ ప్రాంతానికి వెళ్లారు. ఇన్‌స్టాగ్రామ్‌లో లేహ్‌లో తీసిన ఒక అద్భుతమైన ఫోటోను షేర్ చేశారు. లేహ్‌లోని సుందరమైన ప్రదేశాలు అందులో రివీల్ అయ్యాయి. ఈ సినిమాలో కృతి సనన్ పాత్ర పేరు ‘ముక్తి’ అని మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు.
2025 నవంబర్ 25న ఈ చిత్రం విడుదల కానుంది. ఇప్పటివరకు కథాంశాన్ని గోప్యంగా ఉంచిన చిత్రబృందం.. ‘రాంఝనా’ తరహాలో ఓ ఆత్మీయ ప్రేమకథను మళ్లీ తెరపై ఆవిష్కరించనుంది. లేహ్, వారణాసి వంటి ఆధ్యాత్మికతతో నిండిన ప్రదేశాల్లో చిత్రీకరణ జరగడం సినిమాకు మరింత గంభీరతను జోడించనుంది. ‘తేరే ఇష్క్ మేన్’.. ప్రేమకు అర్ధం మారిపోతుందేమో అన్న అనుమానాన్ని కలిగించే పేరు.
-
Home
-
Menu