‘దేవా’ తొలి రోజు పర్వాలేదనిపించింది !

‘దేవా’ తొలి రోజు పర్వాలేదనిపించింది !
X
షాహిద్ గత చిత్రం 'తేరీ బాతోన్ మే ఐసా ఉల్జా జియా' ₹6.7 కోట్లు వసూలు చేయగా.. 'దేవా' ఆ స్థాయిని మాత్రం అందుకో లేకపోయింది.

షాహిద్ కపూర్ ప్రధాన పాత్రలో నటించిన 'దేవా' జనవరి 31, శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మలయాళ చిత్రం 'ముంబై పోలీస్' ఆధారంగా రూపొందిన ఈ సినిమా తొలి రోజు ₹5 కోట్లు వసూలు చేసినట్లు ప్రాథమిక అంచనాలు చెబుతున్నాయి.

పూజా హెగ్డే, పవైల్ గులాటి, ప్రవ్వేశ్ రానా కీలక పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి రోషన్ ఆండ్రూస్ దర్శకత్వం వహించారు. తొలి రోజు 'దేవా' చిత్రం పర్వాలేదనిపించింది. అయితే షాహిద్ గత చిత్రం 'తేరీ బాతోన్ మే ఐసా ఉల్జా జియా' ₹6.7 కోట్లు వసూలు చేయగా.. 'దేవా' ఆ స్థాయిని మాత్రం అందుకో లేకపోయింది. షాహిద్ కెరీర్‌లో అత్యధిక ఓపెనింగ్ కలెక్షన్ సాధించిన సినిమా 'కబీర్ సింగ్'.

“ఒక సంవత్సరం పాటు రక్తం, చెమట, కన్నీళ్లు... 2024 అంతా 'దేవా' నే. నా హృదయం, నా ప్రాణం, నా పని, నా నిబద్ధత. నటనపై నా ప్రేమ.. ప్రేక్షకులపై నా ఆరాధన. నా అనుభవం, నా అంతర్మథనం, నా సృజనాత్మకత.. అన్నీ 'దేవా'లో ఉన్నాయి...” అంటూ షాహిద్ ఒక ఎమోషనల్ నోట్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. మరి ఈ సినిమా ఏ రేంజ్ లో కలెక్ట్ చేస్తుందో చూడాలి.

Tags

Next Story