సీరియస్‌గా తీసుకున్న ఢిల్లీ హైకోర్ట్

సీరియస్‌గా తీసుకున్న ఢిల్లీ హైకోర్ట్
X
తన పేరును కమర్షియల్‌గా దుర్వినియోగం చేయడం, ఫేక్ క్లెయిమ్‌లు, ఏఐతో మార్చిన అసభ్యకరమైన ఫోటోలు, వీడియోలను సర్క్యులేట్ చేయడం వంటి సీరియస్ ఇష్యూస్‌ను ఆమె హైలైట్ చేశారు.

బాలీవుడ్ అందాల హీరోయిన్ ఐశ్వర్యా రాయ్ బచ్చన్ తన పేరు, ఇమేజ్‌లను అనధికారంగా వాడుకోవడం నుంచి రక్షణ కోసం ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ వేశారు. తన పేరును కమర్షియల్‌గా దుర్వినియోగం చేయడం, ఫేక్ క్లెయిమ్‌లు, ఏఐతో మార్చిన అసభ్యకరమైన ఫోటోలు, వీడియోలను సర్క్యులేట్ చేయడం వంటి సీరియస్ ఇష్యూస్‌ను ఆమె హైలైట్ చేశారు.

కోర్టు ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకుని, మరింత దుర్వినియోగాన్ని ఆపేందుకు ఇంజంక్షన్ ఆర్డర్ ఇవ్వడానికి సిద్ధంగా కనిపిస్తోంది. ఐశ్వర్యరాయ్ చివరిగా మణిరత్నం డైరెక్ట్ చేసిన “పొన్నియిన్ సెల్వన్ 2”లో కనిపించారు. కొత్త ప్రాజెక్ట్‌ల గురించి ఇంకా అనౌన్స్‌మెంట్ లేదు.

ఇంతలో.. కొన్ని కంపెనీలు ఆమె ఫోటోలు, వీడియోలను అనుమతి లేకుండా యూజ్ చేస్తున్నాయని, కొన్ని చోట్ల ఏఐతో ఆమె ఇమేజ్‌లను అనధికారికంగా రీక్రియేట్ చేస్తున్నాయని ఆమె గమనించారు. తదుపరి హియరింగ్ జనవరిలో ఉంది, కానీ ఆమె హక్కులను ఉల్లంఘిస్తున్న వాళ్లపై తాత్కాలిక ఇంజంక్షన్ ఆర్డర్‌లు ఇవ్వడానికి కోర్టు రెడీగా ఉందని అంచనా.

Tags

Next Story