స్టార్ కిడ్ కు తల్లిగా దీపికా పదుకొణే !

స్టార్ కిడ్ కు తల్లిగా దీపికా పదుకొణే !
X
దీపికా పదుకొణె ఈ సినిమాలో ఓ ప్రత్యేక పాత్రలో కనిపించనున్నట్టు సమాచారం. ఆమె షారుక్ మాజీ ప్రేయసిగానూ, సుహానా తల్లిగానూ నటించబోతున్నట్టు టాక్.

బాలీవుడ్ బాద్‌షా షారుక్ ఖాన్ మరోసారి భారీ యాక్షన్ థ్రిల్లర్‌తో స్క్రీన్‌ను షేక్ చేయడానికి సిద్ధమవుతున్నాడు. ప్రముఖ దర్శకుడు సిద్ధార్థ్ ఆనంద్ తెరకెక్కిస్తున్న ఈ లేటెస్ట్ మూవీ పేరు 'కింగ్'. ఈ ప్రాజెక్టులో ఓ స్పెషల్ కోణం ఏమిటంటే.. షారుక్‌ సరసన అతని కుమార్తె సుహానా ఖాన్ కూడా కీలక పాత్రలో కనిపించ నుండడం. ఇప్పటికే ప్రీ-ప్రొడక్షన్ పనులతో బిజీగా ఉన్న మూవీటీమ్, మే నెలలో షూటింగ్‌ను ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తోంది. తొలి షెడ్యూల్ ముంబయిలో జరగనుండగా, సినిమా 2026 చివర్లో విడుదల అయ్యే అవకాశముంది.

ఇక ఈ సినిమాకు సంబంధించి బాలీవుడ్ లో ఇప్పుడు ఓ క్రేజీ వార్త హాట్ టాపిక్‌గా మారింది. దీపికా పదుకొణె ఈ సినిమాలో ఓ ప్రత్యేక పాత్రలో కనిపించనున్నట్టు సమాచారం. ఆమె షారుక్ మాజీ ప్రేయసిగానూ, సుహానా తల్లిగానూ నటించబోతున్నట్టు టాక్. దీపిక పాత్ర కథలో కీలకంగా ఉంటుందన్నది బాలీవుడ్ వర్గాల చెబుతున్న మాట. ఇంతకు ముందు షారుక్–దీపిక కాంబినేషన్‌లో వచ్చిన 'ఓం శాంతి ఓం', 'చెన్నై ఎక్స్‌ప్రెస్', 'హ్యాపీ న్యూ ఇయర్', 'పఠాన్' వంటి సినిమాలు ఘనవిజయం సాధించాయి. ఇప్పుడు ఈ కాంబో మళ్లీ తెరపై కనిపిస్తే అభిమానులకు మరో విజువల్ ట్రీట్ లభించినట్లే. దీపిక కూడా ఈ సినిమాలో నటించేందుకు ఆసక్తి చూపిస్తోందని తెలుస్తోంది.

మొదట సుహానాకు తల్లిదండ్రులుగా టబు–సైఫ్ అలీ ఖాన్ పేర్లు పరిగణనలోకి వచ్చినా.. ఆ పాత్రకు దీపికా పదుకొణేనే యాప్ట్ అని భావించి మేకర్స్ ఆమెనే ఫైనల్ చేశారని సమాచారం. అంతేగాక, మరో హైలైట్ ఏంటంటే.. ఈ సినిమాలో విలన్ పాత్రకు అభిషేక్ బచ్చన్ ను ఎంపిక చేసినట్టు టాక్ వినిపిస్తోంది. అతని క్యారెక్టర్ కూడా స్టోరీలో ప్రధానమని సమాచారం. ఈ మేరకు బీ టౌన్‌లో 'కింగ్' సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. షారుక్ కుటుంబం నుంచి తెరంగేట్రం చేస్తున్న సుహానా నటన, దీపిక కొత్త లుక్, అభిషేక్ విలనిజం.. ఇవన్నీ కలిస్తే ప్రేక్షకులకు ఓ పవర్‌ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్ గ్యారంటీ అన్న మాట.

Tags

Next Story