ఆగస్ట్ లో ‘కాక్ టెయిల్ 2’ షూటింగ్ ప్రారంభం !

ఆగస్ట్ లో ‘కాక్ టెయిల్ 2’ షూటింగ్ ప్రారంభం !
X
దినేష్ విజన్ మ్యాడాక్ ఫిల్మ్స్ సమర్పణలో, లవ్ రంజన్ రచనలో రూపొందుతున్న ఈ సీక్వెల్ కథనం గురించి ప్రస్తుతం రహస్యంగా ఉంచారు. 2026 రెండో భాగంలో ఈ చిత్రం థియేటర్లలో విడుదల కానుంది.

ఎన్నో ఊహాగానాల తర్వాత... ‘కాక్‌టెయిల్ 2’ బాలీవుడ్ చిత్రం చిత్రీకరణ ఈ ఆగస్టులో ప్రారంభ మవుతుందని అధికారికంగా ప్రకటించారు. ఈ సీక్వెల్‌లో కొత్త తారాగణంతో కృతి సనన్, షాహిద్ కపూర్, రష్మికా మందన్న ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. 2012లో మొదటి చిత్రం విడుదలైన 13 సంవత్సరాల తర్వాత .. దర్శకుడు హోమి అడజానియా మరోసారి ఈ రొమాంటిక్ డ్రామాను తెరకెక్కిస్తున్నాడు.

దినేష్ విజన్ మ్యాడాక్ ఫిల్మ్స్ సమర్పణలో, లవ్ రంజన్ రచనలో రూపొందుతున్న ఈ సీక్వెల్ కథనం గురించి ప్రస్తుతం రహస్యంగా ఉంచారు. 2026 రెండో భాగంలో ఈ చిత్రం థియేటర్లలో విడుదల కానుంది. ఈ ఉత్సాహాన్ని మరింత పెంచుతూ, హోమి భార్య అయిన సెలబ్రిటీ స్టైలిస్ట్ అనైతా ష్రాఫ్ అడజానియా, శుక్రవారం తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో ‘కాక్‌టెయిల్ 2’ స్క్రిప్ట్‌ను స్నీక్ పీక్‌గా పంచుకున్నారు.

అదే సమయంలో, కృతి సనన్ ముంబైలోని మ్యాడాక్ ఫిల్మ్స్ ఆఫీస్ నుండి బయటకు వస్తూ కనిపించారు. ఇది సన్నాహాలు వేగంగా జరుగు తున్నాయని సూచిస్తోంది. ఈ చిత్రం కృతి, షాహిద్ ల జోడీ నటించబోతున్న రెండో చిత్రం. వీరు గతంలో 2024లో విడుదలైన ‘తేరీ బాతోం మే ఐసా ఉల్ఝా జియా’ చిత్రంలో నటించారు. రష్మికా ఈ మూవీకి కొత్త డైనమిక్‌ను తీసుకొస్తుందని భావిస్తున్నారు.

Tags

Next Story