ఈ పాత్రకు రష్మికా మందన్నే ఎందుకంటే...!

ఈ పాత్రకు రష్మికా మందన్నే ఎందుకంటే...!
X
మరాఠీ సంప్రదాయానికి సరిగ్గా సరిపడే నటిగా ఎందుకు రష్మిక మందన్ననే ఎంపిక చేశారని ఆయనను ప్రశ్నించారు.

రష్మిక మందన్న ఇప్పటికే బాలీవుడ్‌లో టాప్ నటి గా స్థిరపడింది. "ఆనిమల్", "పుష్ప 2" లాంటి రెండు భారీ విజయాలతో అందరి మనసులు గెలుచుకుంది. ఆమె క్రేజ్ ఇంకా పెరుగుతూ ఉండగా.. తాజాగా ఆమె ప్రధాన పాత్రలో నటించిన చారిత్రక యాక్షన్ చిత్రం “ఛావా” విడుదలకు రెడీ అయింది. విక్కీ కౌశల్ టైటిల్ పాత్రలో నటిస్తున్న ఈ చిత్ర దర్శకుడు లక్ష్మణ్ ఉటేకర్.. రష్మిక మందన్న యాక్టింగ్ టాలెంట్, ఆమె ఆకర్షణీయ వ్యక్తిత్వంపై ప్రశంసలు కురిపించాడు.

చత్రపతి శంభాజీ మహారాజు భార్య అయిన రాణి యేసుబాయి పాత్రకు.. మరాఠీ సంప్రదాయానికి సరిగ్గా సరిపడే నటిగా ఎందుకు రష్మిక మందన్ననే ఎంపిక చేశారని ఆయనను ప్రశ్నించారు. దానికి లక్ష్మణ్ ఉటేకర్ బదులిస్తూ ... ఈ పాత్రను రష్మికకు ఆఫర్ చేసినప్పుడు తన స్నేహితులు, నిర్మాతలు కూడా ఒక దక్షిణాది నటి మరాఠీ రాణిగా ఎలా న్యాయం చేస్తుందని సందేహించారు.

అయితే, “ఆమె కళ్లలోని పవిత్రత.. ఆ పాత్రకు సరైన ఎంపిక అవుతుందని నేను వారికి చెప్పాను”.. అని ఆయన మరోసారి క్లారిటీ ఇచ్చారు. రష్మిక నటనలో అంతర్లీనమైన భావోద్వేగాలను అద్భుతంగా ఆవిష్కరించే శక్తి ఉందని.. అలాగే ఆమె బాడీ లాంగ్వేజ్ .. పాత్రలకు ప్రత్యేకతను జోడిస్తుందని లక్ష్మణ్ ఉటేకర్ ప్రశంసించారు.

Next Story