ఓటీటీలో ‘ఛావా’ స్ట్రీమింగ్ మొదలైంది !

ఓటీటీలో ‘ఛావా’ స్ట్రీమింగ్ మొదలైంది !
X
‘ఛావా’ సినిమా ఏప్రిల్ 11 నుంచి అంటే నేటి నుంచే.. నెట్‌ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్‌కి అందుబాటులోకి వచ్చింది. ఇదే తేదీలో.. తెలుగు డబ్బింగ్ వెర్షన్ కూడా స్ట్రీమింగ్ అవుతోంది.

విక్కీకౌశల్‌ నటించిన బాలీవుడ్ పీరియడ్ యాక్షన్ డ్రామా ‘ఛావా’. ఈ సినిమా అందరికీ ఆశ్చర్యం కలిగిస్తూ అంచనాలను మించి విజయాన్ని సాధించింది. శంభాజీ మహారాజ్ జీవితకథ ఆధారంగా రూపొందిన ఈ చిత్రం.. విడుదలైన తొలి రోజే మంచి సమీక్షలు అందుకుంది. తరువాత మౌత్ టాక్ తో సినిమా మరింత బలపడింది.

‘ఛావా’ ఇండియాలోనే రూ. 600 కోట్లు కలెక్షన్లు రాబట్టింది. బాలీవుడ్‌లో ఎన్నో రికార్డులను బద్దలు కొట్టి కలెక్షన్ల వర్షం కురిపించింది. ప్రస్తుతం ‘సికందర్’ బాక్సాఫీస్ వద్ద పూర్తిగా విఫలమవడంతో... ‘ఛావా’ ఇప్పటికీ మంచి కలెక్షన్లు రాబడుతోంది.

ఇదిలా ఉంటే. ‘ఛావా’ సినిమా ఏప్రిల్ 11 నుంచి అంటే నేటి నుంచే.. నెట్‌ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్‌కి అందుబాటులోకి వచ్చింది. ఇదే తేదీలో.. తెలుగు డబ్బింగ్ వెర్షన్ కూడా స్ట్రీమింగ్ అవుతోంది. తెలుగు వెర్షన్ థియేటర్లలో కూడా బాగానే ఆడింది. ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణా రాష్ట్రాల్లో గీతా ఆర్ట్స్ ఈ సినిమాను విడుదల చేసింది.

అక్షయ్ ఖన్నా, రష్మిక మందన్నా వంటి నటులు ముఖ్య పాత్రలు పోషించారు. ఈ చిత్రానికి లక్ష్మణ్ ఉటేకర్ దర్శకత్వం వహించగా, దినేష్ విజన్ మద్దాక్ ఫిల్మ్స్ పతాకంపై నిర్మించారు. ఆస్కార్ విజేత ఏ.ఆర్. రెహ్మాన్ సంగీతం అందించారు. థియేటర్లలో విజయాన్ని అందుకున్న ఈ సినిమా, డిజిటల్ వేదికపై కూడా కొత్త రికార్డులను నెలకొల్పడం ఖాయమని సినీ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

Tags

Next Story