హాస్పిటల్ నుంచి డిస్చార్జ్ అయిన కియారా

హాస్పిటల్ నుంచి డిస్చార్జ్ అయిన కియారా
X
ఆస్పత్రి నుంచి బయల్దేరిన కియారా.. తన లగ్జరీ కారులో తన చిన్నారిని చేతుల్లో జాగ్రత్తగా పట్టుకుని కనిపించింది.

బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ, తన భర్త, హీరో సిద్ధార్థ్ మల్హోత్రాతో కలిసి ఇటీవల తమ మొదటి బిడ్డను స్వాగతించిన సంతోషంలో మునిగి తేలుతోంది. ఈ జంట జూన్ 15, 2025న ఒక అందమైన ఆడబిడ్డకు తల్లిదండ్రులయ్యారు. ఈ రోజు.. కియారా తన కొత్తగా పుట్టిన బేబీతో ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయింది. ఈ క్షణం అభిమానులకు ఆనందకరమైన వార్తగా నిలిచింది. ఆస్పత్రి నుంచి బయల్దేరిన కియారా.. తన లగ్జరీ కారులో తన చిన్నారిని చేతుల్లో జాగ్రత్తగా పట్టుకుని కనిపించింది. పాపరాజీలు ఈ సమయంలో ఆమెను ఫాలో అయ్యారు. కానీ కియారా, సిద్ధార్థ్ ఇద్దరూ చాలా సౌమ్యంగా, తమ బిడ్డ ఫొటోలు తీయవద్దని కోరారు.

తమ కొత్త కుటుంబ సభ్యుని గోప్యతను కాపాడాలనే వారి నిర్ణయం అభిమానుల గౌరవాన్ని పొందింది. ఈ జంట తమ పర్సనల్ లైఫ్‌ను ఎప్పుడూ స్పాట్‌లైట్ నుంచి దూరంగా ఉంచడానికి ప్రయత్నిస్తారని అందరికీ తెలిసిన విషయమే. ప్రస్తుతం, కియారా తన కెరీర్‌కు కాస్త బ్రేక్ ఇచ్చి.. తన మాతృత్వ జర్నీని పూర్తిగా ఆస్వాదించాలని ప్లాన్ చేస్తోంది. ఆమె ఈ కొత్త ఫేజ్‌లో తన బేబీతో క్వాలిటీ టైమ్ స్పెండ్ చేయాలని ఫిక్స్ అయిందని సమాచారం. ఆమె కుమార్తె ఒక సంవత్సరం వయసుకు చేరుకున్నాక.. 2026లో సినిమా సెట్స్‌పై మళ్లీ సందడి చేయడానికి సిద్ధంగా ఉంటుందని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి.

కియారా ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడు ఆమెను స్క్రీన్‌పై చూద్దామా అని ఎదురు చూస్తున్నారు. ఆమె నెక్స్ట్ బిగ్ ప్రాజెక్ట్ “వార్ 2”. ఈ ఏడాది ఆగస్టు 14 న థియేటర్లలో గ్రాండ్‌గా రిలీజ్ కానుంది. ఈ సినిమా ఆమె కెరీర్‌లో మరో మైలురాయిగా నిలవనుందని అంచనా. అప్పటివరకు, కియారా తన చిన్నారితో ఈ అద్భుతమైన టైమ్‌ను ఫుల్ ఎంజాయ్ చేయనుంది. అదే సమయంలో తన పర్సనల్, ప్రొఫెషనల్ లైఫ్‌ను బ్యాలెన్స్ చేస్తూ అందరికీ ఇన్‌స్పిరేషన్‌గా నిలుస్తోంది.

Tags

Next Story