500 మంది డ్యాన్సర్లతో బాలీవుడ్ గ్రాండ్ డాన్స్ సీక్వెన్స్ ట్రెండ్!

'వార్ 2'లో హృతిక్ రోషన్, జూనియర్ ఎన్టీఆర్‌తో కలిసి 500 మంది డ్యాన్సర్లతో గ్రాండ్ డాన్స్ సీక్వెన్స్ చిత్రీకరిస్తున్న వార్త వైరల్ అవుతుండగా.. మరో భారీ బాలీవుడ్ మూవీ అదే ట్రెండ్‌ను ఫాలో అవుతోంది. సల్మాన్ ఖాన్ ప్రతిష్టాత్మక యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘సికందర్’ ఇప్పుడు 500 మంది డ్యాన్సర్లతో ఓ లావిష్ మ్యూజికల్ సీక్వెన్స్ కోసం హెడ్లైన్స్‌లో నిలుస్తోంది.
బాలీవుడ్ వర్గాల సమాచారం ప్రకారం.. ఈ చిత్ర నిర్మాత సాజిద్ నడియాడ్వాలా, అతని టీం ఈ పాటను అద్భుత విజువల్ ఫీస్ట్ గా మలిచేందుకు భారీ ప్రయత్నాలు చేస్తున్నారు. ‘సికందర్’ మూవీ చివరి పాట కోసం ప్రత్యేకంగా 500 మంది ప్రొఫెషనల్ డ్యాన్సర్లను టర్కీ నుంచి తీసుకువచ్చారు. భారీ సెటప్, హై ఎనర్జీ కొరియోగ్రఫీతో కలిపి, ఇది సల్మాన్ ఖాన్ కెరీర్‌లోనే అత్యంత అద్భుతమైన పాట అవుతుందని బాలీవుడ్ వర్గాల వారు అంటున్నారు.
ఇంత భారీ స్థాయిలో చిత్రీకరించిన ఈ పాటలో డ్యాన్సర్ల సమన్వయం, సాంకేతిక నైపుణ్యాలు, అద్భుతమైన ఫార్మేషన్లు కొత్త గ్లోబల్ టచ్‌ను తెచ్చి పెట్టబోతున్నాయి. ఈద్ సందర్భంగా మార్చి 28న ‘సికందర్’ విడుదలకు సిద్ధమవుతుండగా.. ఆగస్టు 14న ‘వార్ 2’ బిగ్ స్క్రీన్‌పైకి రానుంది. బాలీవుడ్‌లో మళ్లీ భారీ డ్యాన్స్ నంబర్ల ట్రెండ్ మళ్లీ మొదలు కానుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. 500 మంది డ్యాన్సర్లతో ఏ సినిమా గొప్ప విజువల్ స్పెక్టాకిల్ అందిస్తుందో చూడాలని అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
-
Home
-
Menu