తెలుగు పరిశ్రమ వైపు బాలీవుడ్ దృష్టి!

సినిమా మార్కెట్‌లో ప్రస్తుతం జరుగుతున్న మార్పులను గమనిస్తే, టాలీవుడ్ బలమైన శక్తిగా ఎదుగుతుంది. బాలీవుడ్‌లో నిర్మాణ వ్యయం భారీగా పెరిగింది. కానీ దానికి తగ్గట్టు థియేటర్ వసూళ్లు ఆశించిన స్థాయిలో లేవు. ఈ పరిస్థితుల్లో తక్కువ బడ్జెట్‌తో ఎక్కువ లాభాలను అందించే తెలుగు సినిమా పరిశ్రమ ఇప్పుడు బాలీవుడ్ నిర్మాతల దృష్టిని ఆకర్షిస్తోంది.
తెలుగు సినిమాలకు ఉన్న విశాలమైన మార్కెట్, స్టార్ హీరోల క్రేజ్, మరియు ప్రేక్షకుల మద్దతు ఈ ట్రెండ్‌కు ప్రధాన కారణాలు. అందుకే బాలీవుడ్ నిర్మాతలు టాలీవుడ్ వైపు పయనించేలా చేస్తుంది. కరణ్ జోహార్ వంటి ప్రముఖ నిర్మాతలు టాలీవుడ్‌లో అవకాశాలను వెతుకుతున్నారు.
కరణ్ జోహార్ ఇప్పటికే తెలుగు సినీ పరిశ్రమతో సాన్నిహిత్యం పెంచుకున్నాడు. ప్రస్తుతం రామ్ చరణ్‌తో సినిమాకోసం చర్చలు జరుపుతున్నాడట. చరణ్ సినిమా మాత్రమే కాదు టాలీవుడ్ లో మరికొన్ని మిడ్-రేంజ్ సినిమాలను కూడా నిర్మించేందుకు సిద్ధమవుతున్నాడట.
ఇది తెలుగు పరిశ్రమకు కొత్త అవకాశాలను తెచ్చినప్పటికీ, స్థానిక నిర్మాతలకు పోటీని పెంచే అవకాశముంది. ఇప్పటికే తెలుగు హీరోల డేట్స్ దొరకడం కష్టంగా మారుతుండగా, బాలీవుడ్ నిర్మాతలు కూడా రంగంలోకి దిగితే పోటీ మరింత తీవ్రమవుతుందనే అనుమానం ఉంది. మరోవైపు ఈ మార్పులు హీరోలకు బంగారు అవకాశంగా మారనున్నాయి. టాలీవుడ్ స్టార్లు పాన్ ఇండియా స్థాయికి ఎదగడం, బాలీవుడ్ నిర్మాతల ఆసక్తి పెరగడం వారి మార్కెట్‌ను విస్తరించడానికి దోహదపడుతుంది.
-
Home
-
Menu