విలనిజానికే కొత్త అర్ధం చెబుతున్నాడు !

విలనిజానికే కొత్త అర్ధం చెబుతున్నాడు !
X
దర్శకుడిగా తనకున్న ప్రత్యేక గుర్తింపుతో పాటు.. నటుడిగా కూడా మంచి ఇమేజ్ సొంతం చేసుకుంటున్నాడు. విలనిజానికే సరికొత్త నిర్వచనం ఇస్తున్నాడు అనురాగ కశ్యప్.

ఇటీవలి కాలంలో.. బాలీవుడ్ నటదర్శకుడు అనురాగ్ కశ్యప్ వరుసగా అద్భుత నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాడు. దర్శకుడిగా తనకున్న ప్రత్యేక గుర్తింపుతో పాటు.. నటుడిగా కూడా మంచి ఇమేజ్ సొంతం చేసుకుంటున్నాడు. విలనిజానికే సరికొత్త నిర్వచనం ఇస్తున్నాడు. ఇంతకుముందు "ఏకే వర్సెస్ ఏకే" చిత్రంలో అనీల్ కపూర్ లాంటి స్టార్ హీరోతో కలిసి నటించిన అనురాగ్, ఆ చిత్రంలో పెద్దగా గుర్తింపు పొందకపోయినప్పటికీ, ఆ తర్వాత నయనతార ప్రధాన పాత్రలో నటించిన ‘ఇమైకా నోడిగళ్’ చిత్రంలో కరుడు గట్టిన విలనిజాన్ని పండించి మంచి పేరు తెచ్చుకున్నాడు.

ఇక రీసెంట్ గా విజయ్ సేతుపతి "మహారాజా" తో ప్రేక్షకుల మన్ననలను గెలుచుకున్నారు. ఈ చిత్రంలో అనురాగ్ తన విలనిజంతో దుమ్మురేపాడు. సేతుపతికి ధీటుగా తన సహజ నటనతో మెప్పించి, విమర్శకుల ప్రశంసలు అందుకున్నాడు.

అనురాగ్ పాత్రలోని అద్భుతమైన విలనిజం ఆయనను కొత్త స్థాయికి చేర్చింది. ప్రస్తుతం థ్రిల్లర్లు, యాక్షన్ డ్రామాల్లో విలన్ పాత్రలకు అనురాగ్ ఒక విశ్వసనీయమైన ఎంపికగా మారిపోయాడనే చర్చ జరుగుతోంది. "మహారాజా" చిత్రం తర్వాత ఆయనకు భారీ అభిమాన వర్గం ఏర్పడింది.

తాజాగా అనురాగ్ "రైఫిల్ క్లబ్" అనే మలయాళ చిత్రంలో తనదైన ముద్ర వేశాడు. ఈ చిత్రం గ్యాంగ్‌స్టర్ బ్యాక్‌డ్రాప్‌లో ఆయుధ మాఫియా కథాంశంతో రూపొందింది. ఇందులో అతడి రూపం, నటన ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. దిలీష్ పోతన్, విజయరాఘవన్, హనుమాన్‌కిండ్ వంటి నటులతో పాటు అనురాగ్ అత్యుత్తమ ప్రదర్శన ఇచ్చాడు.

నెట్‌ఫ్లిక్స్‌లో ప్రీమియర్ అయిన ఈ సినిమాను చూసిన ప్రేక్షకులు కథనానికి తోడుగా అనురాగ్ నటన గురించి విస్తృతంగా మాట్లాడుకుంటున్నారు. పాత్రలో ఆయన పరకాయ ప్రవేశం చేసి జీవించిన తీరు అందరినీ ఆకట్టుకుంది. ఒక దర్శకుడు నటుడిగా ఇంత గంభీరమైన ప్రదర్శన ఇవ్వడం అరుదు, కానీ అనురాగ్ ఈ మైలురాయిని సాధించాడు.

Tags

Next Story