బాలీవుడ్ బాక్సాఫీస్ : 'లవ్యాపా' vs 'బ్యాడాస్ రవి కుమార్'

ఈ ఫిబ్రవరి 7 న బాలీవుడ్ బాక్సాఫీస్‌ను కొత్త పోటీ తాకనుంది. స్టార్ కిడ్స్ జునైద్ ఖాన్, ఖుషీ కపూర్ నటించిన 'లవ్యాపా', దర్శకుడు, గాయకుడు, నటుడు హిమేష్ రేషమ్మియా ప్రధాన పాత్రలో నటించిన 'బ్యాడాస్ రవి కుమార్' సినిమాలు థియేటర్లలో విడుదల కానున్నాయి. ఈ రెండు సినిమాల బాక్సాఫీస్ కలెక్షన్లు ఎలా ఉండబోతున్నాయో అంచనా వేస్తున్నారు.
తాజా సమాచారం ప్రకారం, 'లవ్యాపా' తొలి రోజు 1 నుంచి 2 కోట్ల వరకు వసూలు చేసే అవకాశం ఉంది. అయితే 'బ్యాడాస్ రవి కుమార్' మాత్రం దాదాపు 4 కోట్లకు చేరుకుంటుందని అంచనా వేస్తున్నారు. వీటికి వారం చివరి (వీకెండ్) కలెక్షన్లు పూర్తిగా మౌత్ టాక్ పై ఆధారపడతాయని అభిప్రాయపడ్డారు.
అలాగే..'బ్యాడాస్ రవి కుమార్' బాక్సాఫీస్‌ను షేక్ చేస్తుందని, ఇది భారీగా వసూళ్లు రాబట్టే చిత్రం అవుతుందని అభిప్రాయపడ్డారు. “ఈ సినిమా మొదటి రోజే 5 నుండి 7 కోట్ల మధ్య వసూలు చేసే అవకాశం ఉంది. హిమేష్ రేషమ్మియా సినిమాలకు ఉన్న క్రేజ్, మాస్ ఆడియన్స్‌లో ఈ సినిమాకు ఉన్న బలమైన హైప్ వల్ల ఇది బ్లాక్‌బస్టర్ ఓపెనింగ్ అవుతుందని” అంటున్నారు.
మరోవైపు, 'లవ్యాపా' మీద బజ్ చాలా తక్కువగా ఉందని, మొదటి రోజు 70 లక్షల నుండి 1 కోటి మధ్య వసూలు చేసే అవకాశం ఉందని తెలిసింది. ఈ రెండు సినిమాలు పూర్తిగా భిన్నమైన జానర్స్‌లో ఉన్నాయి. 'లవ్యాపా' ప్రేమకథా నేపథ్యంతో సాగుతుండగా, 'బ్యాడాస్ రవి కుమార్' మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉంది. మరి ఫిబ్రవరి 7న ఈ రెండు సినిమాల మధ్య ఏది గెలుస్తుందో చూడాలి!
-
Home
-
Menu