తొలిసారిగా మెగాఫోన్ పట్టనున్న బాలీవుడ్ బ్యూటీ!

తొలిసారిగా మెగాఫోన్ పట్టనున్న బాలీవుడ్ బ్యూటీ!
X

బాలీవుడ్ లో ‘ప్యాడ్‌మ్యాన్, అంధాధున్, మోనికా ఓ మై డార్లింగ్’ వంటి విమర్శకుల ప్రశంసలు పొందిన చిత్రాలలో నటించింది రాధికా ఆప్టే. ఇప్పుడు ‘కోట్యా’ అనే యాక్షన్ ఫాంటసీ చిత్రంతో దర్శకురాలిగా మారబోతుండడం విశేషం. మొత్తం 22 విభిన్నమైన ప్రాజెక్టులు రాధిక లైనప్‌లో ఉన్నాయి, వీటిలో కొత్త, ప్రతిభావంతులైన దర్శకులు, ప్రఖ్యాత సినీ నిర్మాతల సినిమాలు చోటు చేసుకున్నాయి.

‘కోట్యా’ కథ విషయానికి వస్తే.. ఒక యువతీ, ఆమె కుటుంబం అప్పుల ఊబిలో చిక్కుకుపోయిన నేపథ్యంలో, బలవంతంగా వైద్య చికిత్స చేయించుకున్న తర్వాత ఆమెకు సూపర్ పవర్స్ వస్తాయి. ఈ కొత్త శక్తులను ఉపయోగించి, తన కుటుంబాన్ని అప్పుల బారినుండి ఎలా విడిపించిందన్నదే ప్రధాన కథాంశం. ఈ చిత్రాన్ని ప్రముఖ దర్శకుడు విక్రమాదిత్య మోత్వానే నిర్మిస్తున్నారు. ఈ మూవీ హిందీ, మరాఠీ భాషల్లో రూపొందనుంది.

తాజాగా రాధికా అప్టే ‘సిస్టర్ మిడ్నైట్’ అనే చిత్రంలో కనిపించింది. ఈ సినిమా కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో ప్రదర్శించబడింది. అంతేగాక, బ్రిటిష్ అకాడమీ ఆఫ్ ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఆర్ట్స్ అవార్డుల్లో, "ఉత్తమ డెబ్యూ విభాగంలో నామినేషన్ కూడా పొందింది. ఆమె బ్రిటిష్ ఇండిపెండెంట్ ఫిల్మ్ అవార్డు నామినేషన్ కూడా అందుకుంది. మరి రాధిక మొదటి డెబ్యూ డైరెక్టోరియల్ మూవీ అయిన ‘కోట్యా’ ఏ రేంజ్ లో సక్సెస్ సాధిస్తుందో చూడాలి.

Tags

Next Story