సౌరభ్ గంగూలీగా బ్యాట్ ఝళిపించేది ఇతడేనా..?

ఇండియన్ సినిమా లో బయోపిక్ ట్రెండ్ కొంతమేర తగ్గినప్పటికీ, బాలీవుడ్ మాత్రం ఈ జానర్‌ను ఎప్పటికప్పుడు ప్రోత్సహిస్తూనే ఉంది. ఇప్పుడు, భారత క్రికెట్ దిగ్గజం సౌరవ్ గంగూలీ బయోపిక్‌పై చర్చలు వేడెక్కాయి. ప్రముఖ నటుడు రాజ్‌కుమార్ రావ్ ఈ సినిమాలో ప్రధాన పాత్ర పోషించనున్నట్లు వార్తలు వస్తున్నాయి.
రాజ్‌కుమార్ రావ్ ఇప్పటికే పలు బయోపిక్‌లలో నటించి తనదైన ముద్రవేశారు. ‘షాహిద్’లో న్యాయవాది షాహిద్ ఆజ్మీగా, ‘అలీగఢ్’లో రామచంద్ర సిరాస్‌గా, ‘శ్రీకాంత్’ సినిమాలో దృష్టి లోపం ఉన్న పారిశ్రామిక వేత్త శ్రీకాంత్ బొల్లాగా నటించి ప్రశంసలు అందుకున్నారు. ఇప్పుడు, ‘ద బెంగాల్ టైగర్’గా పేరు పొందిన సౌరవ్ గంగూలీ పాత్రలో మెప్పించేందుకు సిద్ధమవుతున్నారు.
ఈ సినిమా గంగూలీ క్రికెట్ కెరీర్‌ను మాత్రమే కాకుండా, బీసీసీఐ అధ్యక్షుడిగా, అలాగే బెంగాల్ క్రికెట్ అసోసియేషన్‌లో ఆయన పాత్రను కూడా వివరించనుంది. ప్రముఖ దర్శకుడు విక్రమాదిత్య మోత్వానే ఈ ప్రతిష్టాత్మక చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు. ప్రస్తుతం ప్రీ-ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. అన్నీ అనుకున్నట్టు జరిగితే, ఈ బయోపిక్ వచ్చే ఏడాది థియేటర్లలో ప్రేక్షకులను అలరించనుంది.
-
Home
-
Menu