బీచ్ మోడ్ లో ప్రియాంక అండ్ నిక్ జోనస్

ప్రియాంక చోప్రా, నిక్ జోనస్‌లకు సంబంధించిన ఓ కొత్త బీచ్ వీడియో ఆన్‌లైన్‌లో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో వారి మధ్య ఉన్న అనురాగపూరిత క్షణం ఫ్యాన్స్‌ను బాగా ఆకట్టుకుంది. వీడియోలో మొదట నిక్ ఒంటరిగా బీచ్‌లో నిలబడి, కాస్త డల్‌గా కనిపిస్తాడు, స్క్రీన్‌పై “వితౌట్ హెర్’’ అనే కేప్షన్ తో కొన్ని క్షణాల్లో ప్రియాంక ఓడుతూ వచ్చి, నిక్‌ను హత్తుకుని, ముద్దు పెట్టుకుంటుంది. అప్పుడు స్క్రీన్‌పై “విత్ హెర్ ’’ అని మారుతుంది.
ఈ వీడియో ఏమీ హైప్ క్రియేట్ చేయడానికి ప్రయత్నించలేదు. నిక్‌లోని నీరసమైన మూడ్, ప్రియాంక వచ్చిన తర్వాత సంతోషంగా మారడం చూపిస్తుంది. ఈ చిన్న మార్పే పెద్ద ఇంపాక్ట్ క్రియేట్ చేసింది. ఓవర్‌గా ఏమీ లేకుండా, సహజంగా ఉండటమే దీన్ని అందరికీ నచ్చేలా చేసింది. ఇద్దరి మధ్య నిజాయితీ క్షణాన్ని ఎలివేట్ చేసింది.
ప్రియాంక, నిక్ ఇద్దరూ ఈ వ్యక్తిగత క్షణాల దాటి కూడా చాలా బిజీగా ఉన్నారు. నిక్ తన మ్యూజిక్, ఇతర ప్రాజెక్ట్స్‌తో కొనసాగుతున్నాడు. ప్రియాంక ఎస్.ఎస్. రాజమౌళి దర్శకత్వంలో మహేష్ బాబుతో ఓ భారీ సినిమాకు సిద్ధమవుతోంది. ఈ ప్రాజెక్ట్ ఇప్పటికే బాగా హైప్ క్రియేట్ చేస్తోంది. ఎలా ఉంటుందోనని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
ఈ చిన్న వీడియో చాలా సింపుల్‌గా ఉంటూ కూడా బోలెడు ఎమోషన్‌ను చెప్పేసింది. ఫ్యాన్స్‌కు ఇది వీరిద్దరినీ ఫాలో చేయడానికి మరో కారణం. డ్రామా కోసం కాదు, హెడ్‌లైన్స్ కోసం కాదు, ఇలాంటి నిజాయితీ, సరళమైన క్షణాల కోసం. అదే వీరి స్టోరీని ఇంట్రెస్టింగ్‌గా చేస్తుంది.
-
Home
-
Menu