హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్న బాల్ థాక్రే మనవడు!

హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్న బాల్ థాక్రే మనవడు!
X
మహారాష్ట్రలోని అత్యంత ప్రముఖమైన రాజకీయ కుటుంబానికి చెందినప్పటికీ.. ఐశ్వర్య్ ఇంతవరకూ లోప్రొఫైల్ లోనే ఉన్నాడు.

శివసేన వ్యవస్థాపకుడు .. దివంగత బాలా సాహెబ్ థాక్రే మనవడు ఐశ్వర్య్ థాక్రే బాలీవుడ్‌లో అడుగుపెట్టేందుకు సిద్ధమవుతున్నాడు. ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు అనురాగ్ కశ్యప్ రూపొందించే సినిమాతో ఐశ్వర్య్ తన గ్రాండ్ డెబ్యూ చేయనున్నాడు. 2015లో సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వం వహించిన ‘బాజీరావు మస్తానీ’ చిత్రానికి అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేసిన ఐశ్వర్య్ .. ఇప్పుడు నటుడిగా తన ప్రయాణాన్ని ప్రారంభించ బోతున్నాడు.

ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన ఓ విశ్వసనీయ వర్గం తెలిపిన సమాచారం ప్రకారం.. “ప్రతి సమావేశంలోనూ అనురాగ్ కశ్యప్, ఐశ్వర్య థాక్రే సినిమా గురించి ప్రధానంగా చర్చ జరుగుతోంది. ఇండస్ట్రీలోని అనేక నిర్మాణ సంస్థల్లో ఈ చిత్రం హాట్ టాపిక్‌గా మారింది.

మహారాష్ట్రలోని అత్యంత ప్రముఖమైన రాజకీయ కుటుంబానికి చెందినప్పటికీ.. ఐశ్వర్య్ ఇంతవరకూ లోప్రొఫైల్ లోనే ఉన్నాడు. ఐశ్వర్య్ .. మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాక్రే సోదరుడి కుమారుడు, శివసేన వ్యవస్థాపకుడు బాలాసాహెబ్ థాక్రే మనవడు. మరి అనురాగ్ కశ్యప్ .. ఐశ్వర్య్ కోసం ఎలాంటి సినిమా రూపొందిస్తాడో చూడాలి.

Tags

Next Story