టీవీలో పెళ్ళి చేసుకోబోతున్న అవికా గోర్

అందాల హీరోయిన్ అవికా గోర్.. 'ఉయ్యాలా జంపాలా', 'సినిమా చూపిస్త మావ' వంటి చిత్రాలతో మంచి పేరు తెచ్చుకున్న సంగతి తెలిసిందే. ఆమె సెప్టెంబర్ 30న తన బాయ్ ఫ్రెండ్ మిలింద్ చాంద్వానీని వివాహం చేసుకోబోతోంది.
ఈ వివాహానికి ప్రత్యేకత ఏమిటంటే.. ఈ వేడుకను ఆమె టీవీ షో "పతి పత్ని పనగా" లో ప్రసారం చేయబోతోంది. అంటే.. అవికా గోర్, మిలింద్ చాంద్వానీ తమ వివాహ ప్రతిజ్ఞలను టీవీలో ప్రేక్షకుల ముందు తీసుకుంటారు. ఇది టీవీ షో కోసం కాదు, నిజమైన వివాహమే.
ఈ విషయాన్ని అవికా ఇన్‌స్టాగ్రామ్‌లో వెల్లడించింది. ఇంకా పెళ్లి పత్రికలను ఎవరికీ పంపలేదని ఆమె తెలిపింది. స్నేహితులను ఆహ్వానించే ముందు, ముంబైలోని ప్రముఖ సిద్ధి వినాయక ఆలయంలో పూజలు చేయాలని ఆమె ప్లాన్ చేసుకుంది. 28 ఏళ్ల అవికా.. 34 ఏళ్ల మిలింద్‌తో కొంతకాలంగా ప్రేమలో ఉంది. ఈ జంట ఈ ఏడాది జూన్‌లో నిశ్చితార్థం చేసుకున్నారు.
బాల నటిగా ‘చిన్నారి పెళ్ళికూతురు’ సీరియల్ తో టీవీలో బాగా పాపులర్ అయిన అవికా.. టీనేజ్‌లో 'ఉయ్యాలా జంపాలా'తో సినిమా రంగ ప్రవేశం చేసింది. ఆ తర్వాత 'ఎక్కడికి పోతావు చిన్నవాడా', 'రాజు గారి గది 3', 'థాంక్యూ', ఇంకా ఇటీవల 'షణ్ముఖ' వంటి ప్రముఖ చిత్రాలలో నటించింది.
-
Home
-
Menu