వచ్చే నెల నుంచి 'ఆశికీ 3' షూటింగ్ ప్రారంభం!

కార్తిక్ ఆర్యన్ 2022లో 'ఆశికీ 3' ప్రకటించినప్పటి నుంచి ఈ ప్రాజెక్ట్‌పై అభిమానుల్లో భారీ స్థాయిలో ఆసక్తి నెలకొంది. లాంగ్ గ్యాప్ తర్వాత ఈ సినిమాకు సంబంధించిన కీలక అప్‌డేట్‌ను దర్శకుడు అనురాగ్ బసు వెల్లడించారు. ప్రస్తుతం సినిమా ప్రీ-ప్రొడక్షన్ దశలో ఉంది. 2025 మార్చి నుంచి షూటింగ్ మొదలు కానుంది. అని అనురాగ్ తెలిపారు.ఇందులో కథానాయికగా యానిమల్ బ్యూటీ తృప్తి దిమ్రి నటిస్తున్నట్టు సమాచారం.
ఈ చిత్రాన్ని విషేష్ ఫిల్మ్స్, టీ-సిరీస్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. అయితే, కథానాయిక ఎవరనే విషయంపై ఇంకా స్పష్టత రాలేదు. 'ఆశికీ 3' అనురాగ్ బసు, కార్తిక్ ఆర్యన్ కాంబోలోని మొదటి సినిమా. 1990లో మహేష్ భట్ దర్శకత్వంలో వచ్చిన 'ఆశికీ' చిత్రంలో రాహుల్ రాయ్, అనూ అగర్వాల్ జోడీగా నటించారు. 2013లో మోహిత్ సూరి 'ఆశీకీ 2' తో ఈ ప్రేమకథకు సీక్వెల్ తీశారు. ఇందులో శ్రద్ధా కపూర్, ఆదిత్య రాయ్ కపూర్ జంటగా నటించారు.
ఇక అనురాగ్ బసు తన తదుపరి చిత్రం 'మెట్రో ఇన్ డైనో' విడుదల కోసం ఎదురు చూస్తున్నారు. ఈ యాంతాలజీ చిత్రంలో ఆదిత్య రాయ్ కపూర్, సారా అలీఖాన్, అలీ ఫజల్, ఫాతిమా సనా షేక్, అనుపమ్ ఖేర్, నీనా గుప్తా, పంకజ్ త్రిపాఠి, కొంకణా సేన్ శర్మ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.
-
Home
-
Menu