డైరెక్టర్ గా షారుఖ్ తనయుడి అరంగేట్రం !

డైరెక్టర్ గా షారుఖ్ తనయుడి అరంగేట్రం !
X
తన తండ్రిలా నటనా రంగాన్ని ఎంచుకోకుండా.. కెమెరా వెనుక రచయితగా, దర్శకుడిగా కెరీర్‌ను ప్రారంభించడానికి ఆర్యన్ సిద్ధమవడం విశేషం.

బాలీవుడ్ కింగ్ ఖాన్ షారుఖ్ తనయుడు ఆర్యన్ ఖాన్.. తన డెబ్యూ డైరెక్టోరియల్ ప్రాజెక్ట్ ‘స్టార్డమ్’ విడుదల కోసం సన్నద్ధమవుతున్నాడు. తన తండ్రిలా నటనా రంగాన్ని ఎంచుకోకుండా.. కెమెరా వెనుక రచయితగా, దర్శకుడిగా కెరీర్‌ను ప్రారంభించడానికి ఆర్యన్ సిద్ధమవడం విశేషం. ఈ సిరీస్ నెట్‌ఫ్లిక్స్‌లో ఈ ఏడాది చివరిలో స్ట్రీమింగ్ కు వస్తుంది. ఈ ప్రాజెక్ట్ యువ ఖాన్ డెబ్యూ కావడంతో పాటు ఇందులో భాగమైన ప్రముఖ తారల కారణంగా అందరిలోనూ ఆసక్తిని రేకెత్తిస్తోంది.

ఇటీవల.. ‘స్టార్డమ్’ షూటింగ్ సెట్స్‌పై.. ఆర్యన్ ఖాన్ సన్నివేశం డైరెక్ట్ చేస్తున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయింది. షారుఖ్ ఖాన్ ఫ్యాన్స్ క్లబ్ ఎక్స్ వేదికగా ఈ వీడియోను షేర్ చేసింది. ఆ వీడియోలో ఆర్యన్ తన టీమ్‌కి ఒక సన్నివేశంలో ఎలా నటించాలో వివరిస్తూ కనిపించాడు. సీరియస్ ఎక్స్‌ప్రెషన్‌తో, ఆ సన్నివేశం వివరిస్తున్న ఆర్యన్ ను చూసి ఫ్యాన్స్ ఎంతగానో మురిసిపోయారు.

ఆర్యన్ తన తొలి డైరెక్టోరియల్ ప్రాజెక్ట్ కోసం ఒక ఇంటిమేట్ స్టోరీ ఎంచుకున్నాడు. ఈ సిరీస్ బాలీవుడ్ ప్రపంచంలో ఒక కాన్ఫిడెన్స్ తో నిండిన అవుట్‌సైడర్ ప్రయాణాన్ని ప్రతిబింబిస్తుంది. ఇందులో రణవీర్ సింగ్, రణబీర్ కపూర్, కరణ్ జోహార్, అలాగే ఆర్యన్ తండ్రి షారుఖ్ ఖాన్ వంటి స్టార్స్ క్యామియోస్ చేయబోతున్నారు. ఈ ప్రాజెక్ట్‌లో ఆర్యన్ చిన్న చెల్లెలు సుహానా ఖాన్ కూడా కనిపించనుంది. సుహానా 2023లో జోయా అక్తర్ దర్శకత్వం వహించిన నెట్‌ఫ్లిక్స్ చిత్రం ఆర్చీస్తో తన నటన రంగంలో అడుగుపెట్టింది. మరి ‘స్టార్డమ్’ మూవీతో ఆర్యన్ ఎలాంటి స్టార్ డమ్ తెచ్చుకుంటాడో చూడాలి.

Tags

Next Story