షారుఖ్ ‘కింగ్’ లో మరో క్రేజీ నటుడు !

బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ తదుపరి చిత్రం "కింగ్" గురించి కొన్ని ఆసక్తికరమైన అప్‌డేట్స్ వచ్చాయి. తాజా సమాచారం ప్రకారం, సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో అర్షద్ వార్సీ కూడా నటించబోతున్నట్టు తెలుస్తోంది. ఈ ఏడాది రెండవ భాగంలో ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కానుంది. ఒకవేళ ఇది నిజమైతే.. 2005లో వచ్చిన "కుఛ్ మీఠా హో జాయే" తర్వాత దాదాపు రెండు దశాబ్దాల తర్వాత షారుఖ్‌తో అర్షద్ రెండోసారి కలిసి నటించనున్నారు.
ఇక ఈ సినిమాలో అర్షద్ పాత్ర వివరాల విషయంలో సీక్రెసీ మెయిన్ టెయిన్ చేస్తోంది టీమ్. కానీ అతని ఎంపిక ఈ చిత్రంపై అంచనాలను మరింత పెంచింది. షారుఖ్ ఖాన్, అర్షద్ వార్సీతో పాటు ఈ చిత్రంలో సుహానా ఖాన్, అభిషేక్ బచ్చన్, అభయ్ వర్మా వంటి తారాగణం ఉన్నారు. ఇందులో దీపికా పదుకొణె కూడా ఒక ప్రత్యేక పాత్రలో కనిపించనుందని టాక్. ఈ చిత్రం మే నెలలో కాకుండా జులైలో షూటింగ్ ప్రారంభించనుంది. దీనికి కారణం స్క్రిప్ట్‌పై షారుఖ్ సంతృప్తి చెందకపోవడమని తెలుస్తోంది.
ప్రస్తుతం ‘కింగ్’ మూవీ "స్క్రిప్ట్ పనులు జరుగుతున్నాయి. కెమెరా రోల్ అయ్యే ముందు ఒక అద్భుతమైన స్క్రిప్ట్ సిద్ధంగా ఉండాలని చిత్ర బృందం కోరుకుంటోంది. 'కింగ్' చిత్రం సుహానాను మొదటిసారి పెద్ద తెరపై ఆవిష్కరిస్తుంది. అంతేకాదు.. తండ్రీకూతుళ్ళ జోడీని కూడా చూపిస్తుంది. ఈ అంశాలను దృష్టిలో ఉంచుకుని, షారుఖ్ స్క్రిప్ట్‌ను మెరుగుపరచడానికి బృందానికి సమయం ఇవ్వాలని కోరుకుంటున్నారు. జులై-ఆగస్టులో షూటింగ్ ప్రారంభించేందుకు బృందం ప్లాన్ చేస్తోంది.
షారుఖ్ ఖాన్ ఈ చిత్రంలో ఒక అసాసిన్ పాత్రలో కనిపించనున్నారని.. అతని కూతురు సుహానా అతని శిష్యురాలిగా నటించనుందని తెలుస్తోంది. తన కూతురుపై అన్యాయం జరగడంతో షారుఖ్ పాత్ర ప్రతీకారం, విధ్వంసం కోరుతుందని సమాచారం. అభిషేక్ బచ్చన్ విలన్ గా నటించబోతున్నాడు. దీపికా పదుకొణె సుహానా తల్లి పాత్రలో నటిస్తారని సమాచారం. "కింగ్" చిత్రం 2026లో విడుదల కానుంది.
-
Home
-
Menu