నారీ నారీ నడుమ మురారీ.. అర్జున్ కపూర్ !

అర్జున్ కపూర్, భూమి పడ్నేకర్, రకుల్ ప్రీత్ సింగ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న రొమాంటిక్ కామెడీ 'మేరే హస్బెండ్ కి బివీ'. ఈ సినిమా ఫిబ్రవరి 21న థియేటర్లలో విడుదల కానుంది. తాజాగా చిత్రబృందం ఈ సినిమా నుండి కొత్త పోస్టర్‌ను విడుదల చేసింది. ఈ పోస్టర్‌లో అర్జున్ కపూర్ 'లవ్ సర్కిల్' లో చిక్కుకున్నట్లుగా కనిపించగా.. భూమి పడ్నేకర్, రకుల్ ప్రీత్ సింగ్ ఇద్దరూ గుర్రాలపై కూర్చొని అతన్ని ఎదుర్కొంటున్నారు.
ఈ పోస్టర్‌పై "లవ్ ట్రయాంగిల్ కాదు, లవ్ సర్కిల్!" అనే ట్యాగ్‌లైన్ ఉంది. దీని ద్వారా సినిమాలో హాస్యపూరితమైన సంఘర్షణ ఉంటుందని స్పష్టమవుతోంది. ఈ చిత్రానికి ముదస్సర్ అజీజ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఆయన గతంలో 'పతి పత్నీ ఔర్ వో', 'హ్యాపీ భాగ్ జయేగీ', 'ఖేల్ ఖేల్ మేన్' వంటి హిట్ సినిమాలు తెరకెక్కించారు.
ఇక అర్జున్ కపూర్ ఇటీవల విడుదలైన 'సింఘం అగైన్' లో నటనకు మంచి ప్రశంసలు అందుకున్నాడు. రకుల్ ప్రీత్ సింగ్ త్వరలో 'దే దే ప్యార్ దే 2' లో కనిపించనుంది. భూమి పడ్నేకర్ తన వెబ్‌సిరీస్ 'దల్దల్' ద్వారా డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌లో ఎంట్రీ ఇవ్వనుంది.
-
Home
-
Menu