ప్రియాంకా చోప్రా నెక్స్ట్ ప్రాజెక్ట్స్ ఇవేనా?

గ్లోబల్ స్టార్‌గా పేరుగాంచిన బాలీవుడ్ బ్యూటీ ప్రియాంకా చోప్రా.. ప్రస్తుతం హైదరాబాద్‌లో ఉంటూ మహేష్ బాబు, రాజమౌళి కాంబినేషన్ లో రూపొందు తున్న యస్ యస్ యం బీ29 చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. హైదరా బాద్‌లోని అల్యూమినియం ఫ్యాక్టరీలో ప్రత్యేకంగా నిర్మించిన సెట్లో ఈ సినిమా చిత్రీకరణ శరవేగంగా జరుగుతోంది.
తన తొలి తెలుగు చిత్రానికి అహర్నిశలు శ్రమిస్తున్న ప్రియాంకా చోప్రా.. మరోవైపు కొత్త ప్రాజెక్టులకు సంతకం చేస్తూ మరింత బిజీగా మారుతోంది. తాజా సమాచారం ప్రకారం.. ఆమె ఇప్పటికే హాలీవుడ్ చిత్రం "హెడ్స్ ఆఫ్ స్టేట్" కి సంతకం చేసినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా.. ఆమె ప్రధాన పాత్రలో నటించిన "సిటాడెల్" వెబ్ సిరీస్ రెండో సీజన్‌ను కూడా ప్రారంభించనున్నట్లు సమాచారం.
మహేష్ బాబుతో జతకట్టిన యస్ యస్ యం.బీ 29 షూటింగ్ 2025 మరియు 2026 మొత్తం కొనసాగనుంది. ఈ చిత్రం తెలుగు, హిందీతో పాటు ఇతర భాషల్లో కూడా విడుదల కానుంది. ఆఫ్రికన్ జంగిల్ అడ్వంచరస్ మూవీగా రూపొందుతోన్న ఈ సినిమాలో ప్రియాంకా చోప్రా హీరోయిన్ గా నటిస్తోందా లేక విలన్ గా నటిస్తోందా అనే విషయంలో ఇంకా క్లారిటీ రాలేదు
-
Home
-
Menu