సిల్వర్ స్క్రీన్ పై రీ యాక్టివేట్ అవుతోన్న అనన్య పాండే !

సిల్వర్ స్క్రీన్ పై రీ యాక్టివేట్ అవుతోన్న అనన్య పాండే !
X

సిల్వర్ స్క్రీన్ పై రీ యాక్టివేట్ అవుతోన్న అనన్య పాండే !బాలీవుడ్ యాక్టర్ చుంకీ పాండే కూతురిగా బాలీవుడ్‌కు ఎంట్రీ ఇచ్చింది అనన్య పాండే. తన గ్లామర్‌తో అతి తక్కువ సమయంలోనే ప్రేక్షకులను ఆకట్టుకుంది. 2019లో "స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ 2" ద్వారా వెండితెరపై అడుగుపెట్టిన అనన్య, "పతి పత్ని ఔర్ వో" వంటి సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. అయితే, విజయ్ దేవరకొండతో కలిసి నటించిన "లైగర్" సినిమా ఆమె కెరీర్‌కు పెద్ద దెబ్బకొట్టింది. పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన ఈ భారీ ప్రాజెక్ట్ బాక్సాఫీస్ వద్ద ఘోరంగా విఫలమైంది. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో చుంకీ పాండే.. ఈ సినిమా తన కూతురికి ఇష్టం లేకపోయినా చేసిందని వెల్లడించారు. అయితే, ఈ ఫ్లాప్‌ను త్వరగానే మరచిపోయి, అనన్య తన కెరీర్‌పై దృష్టి పెట్టింది.

తన సినీ జెర్నీలో అనన్య ఎక్కువగా ఓటీటీ ప్రాజెక్ట్స్‌కే ప్రాధాన్యం ఇచ్చింది. "ఖాళీ పీలి," "గెహరాయియా," "ఖో గయా హమ్ కహాన్," "సీటీఆర్ఎల్" వంటి సినిమాలతో డిజిటల్ వేదికపై ప్రేక్షకులను ఆకట్టుకుంది. థియేట్రికల్ రిలీజ్ అయిన "డ్రీమ్ గర్ల్ 2" తర్వాత వెండితెరపై ఆమె కనిపించలేదు. బాలీవుడ్‌లో తన సమకాలీన నటి జాన్వీ కపూర్ ఇప్పటికే టాలీవుడ్, కోలీవుడ్ వరకూ తన కెరీర్ ను విస్తరించుకోగా.. అనన్య మాత్రం ఓటీటీ సినిమాలకే పరిమితమైంది. అయితే, ఇప్పుడు ఆమె థియేట్రికల్ మార్కెట్‌పై మళ్లీ దృష్టి సారించింది.

ప్రస్తుతం అనన్య చేతిలో రెండు ప్రధాన ప్రాజెక్ట్స్ ఉన్నాయి. "కిల్" చిత్రంతో పేరు తెచ్చుకున్న లక్ష్య హీరోగా నటిస్తున్న "చాంద్ మేరా దిల్" మూవీలో ఆమె కథానాయికగా నటిస్తోంది. కాలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో రూపొందుతున్న ఈ సినిమా మార్చి 15 నుంచి సెట్స్‌పైకి వెళ్లనుంది. అలాగే, "కేసరి చాప్టర్ 2"లో కూడా అనన్య కీలక పాత్ర పోషించనుంది. ఓటీటీ నుంచి మళ్లీ వెండితెరకు ఈ ముద్దుగుమ్మ దూసుకురావాలని ప్లాన్ చేస్తోంది. మరి ఈసారి ఏ మేరకు సక్సెస్ సాధిస్తుందో చూడాలి.

Tags

Next Story