‘డాన్ 3’ లో బచ్చన్ అండ్ ఖాన్ ?

ఫర్హాన్ అక్తర్ చాలా కాలం క్రితం రణవీర్ సింగ్‌తో 'డాన్ 3' ని ప్రకటించాడు. కానీ వివిధ సమస్యల వల్ల ఈ సినిమా ఇంకా షూటింగ్ దశకు చేరలేదు. దర్శకుడు ఇప్పుడు 2026 జనవరిలో షూటింగ్ ప్రారంభించాలని ప్లాన్ చేస్తున్నాడు. తాజా సమాచారం ప్రకారం.. ఈ మూడవ భాగంలో గతంలో డాన్ పాత్రలో మెప్పించిన షారుఖ్ ఖాన్ అండ్ అమితాబ్ బచ్చన్ కూడా నటించే అవకాశం ఉంది.
ఇండస్ట్రీ వర్గాల సమాచారం ప్రకారం.. బచ్చన్ అండ్ ఖాన్ ఈ ఆఫర్‌ను పరిశీలిస్తున్నారు. అధికారిక నిర్ధారణ ఇంకా రాలేదు, కానీ మూడు తరాల డాన్‌లను ఒకే స్క్రీన్‌పై చూసే అవకాశం ఆసక్తికరంగా ఉంది. ఒకవేళ ఇది నిజమైతే, అమితాబ్ బచ్చన్, షారుఖ్ ఖాన్, రణవీర్ సింగ్ మొదటిసారి కలిసి స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నారు.
ఈ ప్రాజెక్ట్ మొదట ప్రకటించినప్పుడు.. షారుఖ్ ఖాన్ ఈ సినిమాలో హీరోగా నటించాలని ఫ్యాన్స్ డిమాండ్ చేశారు. అప్పట్లో చాలా విమర్శలు వచ్చాయి. ఒకవేళ ఈ తాజా వార్త నిజమైతే, ఆ క్రేజీ డాన్‌లను కూడా చూసే అవకాశం ప్రేక్షకులకు రావడంతో ప్రాజెక్ట్ చుట్టూ ఉన్న నెగెటివిటీ తగ్గే అవకాశం ఉంది.
-
Home
-
Menu