‘పఠాన్ 2’ కోసం మేకర్స్ ఐకానిక్ ప్లాన్ !

‘పఠాన్ 2’ కోసం మేకర్స్ ఐకానిక్ ప్లాన్ !
X
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్.. షారుక్ ఖాన్ సినిమా ‘పఠాన్ 2’లో స్పెషల్ అపీరెన్స్ ఇవ్వబోతున్నాడట.

‘పుష్ప’ బాక్సాఫీస్‌ను షేక్ చేసినప్పటి నుంచి అల్లు అర్జున్ తరచుగా ముంబైకి వెళ్తుండటంతో అభిమానుల్లో ఉత్కంఠ పెరిగిపోయింది. బాలీవుడ్ ఎంట్రీనా? లేక ఏదైనా పెద్ద అనౌన్స్‌మెంట్ నా? అంటూ.. రూమర్స్ తెగ మారు మోగి పోతున్నాయి. కానీ ఇప్పుడు మరో ఆసక్తికరమైన వార్త తెరపైకి వచ్చింది. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్.. షారుక్ ఖాన్ సినిమా ‘పఠాన్ 2’లో స్పెషల్ అపీరెన్స్ ఇవ్వబోతున్నాడట.

విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. ‘పఠాన్’లో సల్మాన్ ఖాన్ మాస్ క్యామియో ఇచ్చినట్టు, ‘పఠాన్ 2’లో అల్లు అర్జున్ పవర్‌ఫుల్ యాక్షన్ సీన్ చేయబోతున్నాడని టాక్. దర్శకుడు సిద్ధార్థ్ ఆనంద్, వైఆరెఫ్ టీమ్ కలిసి ఈ సీక్వెన్స్‌ను ప్లాన్ చేస్తున్నారట. ఇదే ఆయన బాలీవుడ్ ఎంట్రీకి తొలి అడుగవుతుందా? అన్నది ఇంకా తేలాల్సిన విషయం.

ఓ వైపు బాలీవుడ్‌లో అల్లు అర్జున్ సినిమా వాదనలు ఊపందుకుంటుంటే.. టాలీవుడ్‌లో ఆయన తదుపరి ప్రాజెక్ట్ ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. త్రివిక్రమ్, అట్లీ వంటి పేర్లు వినిపిస్తున్నా... అధికారికంగా పూజా కార్యక్రమం ఎప్పుడనేది అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. షారుక్ అండ్ అల్లు అర్జున్ కలయిక కానీ నిజమైతే ఇండియన్ సిన్మా అభిమానులకు పండగే పండగ.

Tags

Next Story