అర్జునుడు గా అల్లు అర్జున్ ?

బాలీవుడ్ సూపర్ స్టార్ ఆమిర్ ఖాన్ మహాభారతాన్ని భారత ప్రేక్షకులకు సమర్పించాలనే ఒక పెద్ద డ్రీమ్ తో ఉన్నారు. గత కొంత కాలంగా ఈ ప్రాజెక్టుపై ఆయన తీవ్రంగా పనిచేస్తున్నారు. పౌరాణిక ఇతిహాసంగా నిలిచిన మహాభారతాన్ని అనేక భాగాలుగా రూపొందించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ అద్భుత భారీ ప్రాజెక్ట్ తొలి భాగానికి లెజెండరీ డైరెక్టర్ సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వం వహించనున్నారు.
ఆమిర్ ఖాన్, భారతదేశంలోని వివిధ భాషల సినీ రంగాలకు చెందిన ప్రముఖ నటులను ఈ చిత్రంలో ప్రధాన పాత్రల్లో నటింపజేయాలనే ఆలోచనలో ఉన్నారు. తాజా వార్తల ప్రకారం... ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌ను ఈ చిత్రంలో అర్జునుడిగా తీసుకునే ఆలోచన జరుగుతోందట. అల్లు అర్జున్ ప్రస్తుతం ముంబైలో అట్లీ సినిమా సంబంధించి ఉన్న సందర్భంలో, ఆమిర్ ఖాన్‌తో ఆయన భేటీ అయ్యారు. ఆ సమావేశంలో మహాభారత ప్రాజెక్ట్‌పై చర్చలు జరిగినట్లు సమాచారం.
గత కొన్ని నెలలుగా సంజయ్ లీలా భన్సాలీ కూడా అల్లు అర్జున్‌ను పలుమార్లు కలిశారు. ‘పుష్ప 2: ది రూల్’ విడుదలైన తరువాత భన్సాలీ ఆఫీసులో అల్లు అర్జున్ కనిపించడంతో ఈ వార్తలకు మరింత బలం చేకూరింది. తాజా సమాచారం ప్రకారం, ఈ మహాభారత ప్రాజెక్టును మొత్తం ఐదు భాగాలుగా రూపొందించాలన్న ఆమిర్ ఖాన్ ఆలోచనలో ఉన్నారు. ప్రతి భాగానికి ఒక టాప్ డైరెక్టర్ దర్శకత్వం వహించనుండగా, ఒక్కో భాగం విడుదలకు ఆరు నెలల వ్యవధి ఉండేలా ప్లాన్ చేస్తున్నారు. ఈ భారీ ప్రాజెక్ట్‌కు అంచనా వ్యయం రూ.1000 కోట్లుగా భావిస్తున్నారు. ఇందులో ఆమిర్ ఖాన్ తానే శ్రీకృష్ణునిగా నటించనున్నారని టాక్.
-
Home
-
Menu