‘వార్ 2’ లో కామియో రోల్?

బాలీవుడ్ బ్యూటీ అలియా భట్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ "ఆర్‌ఆర్‌ఆర్" అనే గ్లోబల్ బ్లాక్‌బస్టర్‌లో కలిసి నటించారు. కానీ వారు జోడీ కట్టలేదు. అలియా రామ్ చరణ్‌కు జంటగా నటించింది. ఇప్పుడు.. ఈ ఇద్దరు స్టార్స్ "వార్ 2" కోసం మరోసారి కలుస్తున్నారు. కానీ మళ్లీ రొమాంటిక్ జంటగా కాదు. తాజా బజ్ ప్రకారం... అలియా భట్ "వార్ 2"లో కామియో రోల్‌లో కనిపించనుంది.
ఇందులో ఎన్టీఆర్, హృతిక్ రోషన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఆదిత్య చోప్రా నిర్మాణంలో ఈ చిత్రం తెరకెక్కుతుండగా.. పెద్ద స్టార్స్‌ను తీసుకోవడం ఎప్పుడూ సమస్య కాదు. అంతేకాకుండా.. దర్శకుడు అయాన్ ముఖర్జీ.. అలియా భర్త రణబీర్ కపూర్‌తో సన్నిహిత సంబంధం కలిగి ఉన్నాడు, ఇది ఆమె ఈ చిత్రంలో కనిపించడానికి దోహదపడిందని తెలుస్తోంది.
ఆలియా కామియో అభిమానులకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందని భావిస్తున్నారు. "ఆర్‌ఆర్‌ఆర్" తర్వాత అలియా భట్ తెలుగు సినిమాల్లో మరిన్ని పాత్రలు చేయాలనే ఆసక్తిని చూపినప్పటికీ.. ఆమె ఇంకా టాలీవుడ్‌లో పెద్ద ప్రాజెక్ట్‌ను సైన్ చేయలేదు. భవిష్యత్తులో ఎప్పుడైనా ఒక దర్శకుడు ఎన్టీఆర్, అలియాను ఒక రొమాంటిక్ జంటగా తెరపైకి తీసుకొస్తాడని ఆశిద్దాం.
-
Home
-
Menu