అక్షయ్ కుమార్ ‘బూత్ బంగ్లా’ షూటింగ్ పూర్తి

అక్షయ్ కుమార్ ‘బూత్ బంగ్లా’ షూటింగ్ పూర్తి
X
“ప్రియన్ సార్” అని ఆయన సాదరంగా పిలుచుకుంటూ, మళ్ళీ ఒక జ్ఞాపకంగా నిలిచిపోయే ప్రయాణాన్ని ఇచ్చినందుకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు.

బాలీవుడ్ సూపర్‌స్టార్ అక్షయ్ కుమార్ తన తదుపరి చిత్రం 'బూత్ బంగ్లా' షూటింగ్ పూర్తి చేసుకున్న విషయాన్ని సామాజిక మాధ్యమాల్లో తెలియజేశాడు. ఇది తనకు ప్రముఖ దర్శకుడు ప్రియదర్శన్ తో కలిసి చేసిన ఏడవ ‘మ్యాడ్‌ క్యాప్ అడ్వెంచర్’ అని ఆయన ఆనందంగా వెల్లడించాడు. “ప్రియన్ సార్” అని ఆయన సాదరంగా పిలుచుకుంటూ, మళ్ళీ ఒక జ్ఞాపకంగా నిలిచిపోయే ప్రయాణాన్ని ఇచ్చినందుకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు.

అక్షయ్, ప్రియదర్శన్ కాంబినేషన్ అనగానే నవ్వుల వేడుకలు గుర్తుకు వస్తాయి. వీరిద్దరూ కలిసి చేసిన సినిమాలు బాలీవుడ్ చరిత్రలో చిరస్మరణీయంగా నిలిచాయి. హేరా ఫేరి అనే కల్ట్ క్లాసిక్‌ నుంచి డోలి సజా కే రఖ్నా , గరం మసాలా , భాగం భాగ్ , దే దనా దన్ , ఖట్టా మీఠా వరకూ, ప్రతి సినిమా అక్షయ్ కుమార్ హాస్య నటనకు, ప్రియదర్శన్ యొక్క వినోదాత్మక దర్శకతనానికి నిలువెత్తు నిదర్శనాలుగా నిలిచాయి.

ఇప్పుడు 'బూత్ బంగ్లా' తో ఈ జోడి హారర్ కామెడీ అనే వినూత్న శైలిలోకి అడుగుపెడుతోంది. హారర్ ను నవ్వులతో ముడిపెట్టి ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో ఈ ఇద్దరి ప్రత్యేక శైలి ఎలా ఉంటుందో అన్న ఆసక్తి ఇప్పటికే ప్రేక్షకుల్లో మొదలైంది. ఈ చిత్రాన్ని ఎక్తా కపూర్ నిర్మిస్తున్నారు. అక్షయ్ ఆమెను “అప్రతిహత శక్తి”గా అభివర్ణించాడు. ధైర్యవంతమైన కథల ఎంపిక, ప్రేక్షకుల నాడిని పట్టుకునే ఆమె ప్రత్యేకత ఈ సినిమాపై ఉన్న అంచనాలను మరింత పెంచుతోంది.

ఇంతవరకూ అక్షయ్ కుమార్‌తో కలిసి పనిచేయని వామికా గబ్బీ ఈ చిత్రంలో కథానాయికగా కనిపించనుంది. "తన ప్రతి రూపంలో ఆశ్చర్యాన్ని కలిగించే నటి"గా వామికాను అక్షయ్ కొనియాడాడు. వామికా ఇప్పటికే సినిమాలు, ఓటీటీ వేదికలపై తన పాత్రలతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటి. ఆమె నటించిన 'భుల్ చుక్ మాఫ్' సినిమా మే 23న విడుదల కానుంది.

Tags

Next Story