25 ఏళ్ళ తర్వాత మళ్ళీ స్ర్కీన్ పైకి హిట్ పెయిర్

‘భూత్ బంగ్లా’ చిత్రం 2 ఏప్రిల్ 2026న థియేటర్లలో విడుదలకు సిద్ధమైంది. ఈ హర్రర్ కామెడీ చిత్రంలో ఓ ప్రత్యేకమైన విశేషం చోటుచేసుకుంటోంది. 25 సంవత్సరాల తర్వాత అక్షయ్ కుమార్, టబు హిట్ పెయిర్ మరోసారి స్క్రీన్‌పై సందడి చేయబోతోంది. రీసెంట్ గా అక్షయ్ కుమార్ టబును సెట్స్‌పై ఆత్మీయంగా స్వాగతించగా, ఆ ఫోటోలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయ్యాయి. ప్రముఖ నిర్మాతలు ఇన్‌స్టాగ్రామ్‌లో అక్షయ్-టబు కలయికకు సంబంధించిన ఫోటోను షేర్ చేయడంతో అభిమానుల్లో ఆనందం వెల్లివిరిసింది. గతంలో ఈ జోడీ ‘హేరాఫేరి’ అనే కల్ట్-క్లాసిక్ చిత్రంలో నటించి గుర్తిండిపోయే కెమిస్ట్రీని పండించింది. ఇప్పుడు ‘భూత్ బంగ్లా’ కోసం వీరిద్దరూ మళ్లీ కలిసి నటిస్తున్నారు.
దిగ్గజ దర్శకుడు ప్రియదర్శన్ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా అభిమానుల్లో భారీ అంచనాలను నెలకొల్పింది. ఈ చిత్రాన్ని బాలాజీ టెలిఫిల్మ్స్, అక్షయ్ కుమార్ నిర్మాణ సంస్థ కేప్ ఆఫ్ గుడ్ ఫిల్మ్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఫారా షేక్, వేదాంత్ బాలి, ఏక్తా కపూర్ ఈ చిత్రానికి నిర్మాతలు. కథను ఆకాష్ ఎ కౌశిక్ రచించగా, స్క్రీన్‌ప్లేను రోహన్ శంకర్, అభిలాష్ నాయర్, ప్రియదర్శన్ రూపొందించారు. సంభాషణల రచన రోహన్ శంకర్ చేయగా, ప్రస్తుత షూటింగ్ షెడ్యూల్ జైపూర్‌లో జరుగుతోంది. ఇలాంటి అరుదైన కలయికతో, ‘భూత్ బంగ్లా’ 2026లో మోస్ట్ అవైటెడ్ సినిమాల్లో ఒకటిగా నిలవనుంది.
-
Home
-
Menu