ఆకట్టుకుంటున్న ‘రెయిడ్ 2’ ట్రైలర్

ఆకట్టుకుంటున్న ‘రెయిడ్ 2’  ట్రైలర్
X
ట్రైలర్‌లో దేశం కోసం నిజాయితీగా పోరాడే ఐటీ ఆఫీసర్ అమయ్ పాత్రలో అజయ్ దేవగన్, అవినీతిలో మునిగిపోయిన రాజకీయ నాయకుడిగా రితేశ్ దేశ్‌ముఖ్ మధ్య ఉద్రిక్తతలు ప్రధానంగా చూపబడ్డాయి.

అజయ్ దేవగన్, రితేశ్ దేశ్‌ముఖ్ ప్రధాన పాత్రల్లో నటించిన బాలీవుడ్ మూవీ 'రెయిడ్ 2' ఫస్ట్ ఫుల్ ట్రైలర్ విడుదలైంది. ఈ సారి ఆయనకు తోడుగా వాణీ కపూర్ కనిపించనున్నారు. ట్రైలర్‌లో దేశం కోసం నిజాయితీగా పోరాడే ఐటీ ఆఫీసర్ అమయ్ పాత్రలో అజయ్ దేవగన్, అవినీతిలో మునిగిపోయిన రాజకీయ నాయకుడిగా రితేశ్ దేశ్‌ముఖ్ మధ్య ఉద్రిక్తతలు ప్రధానంగా చూపబడ్డాయి.

మొదటి భాగం ‘రెయిడ్’ లో .. అమయ్, రమేశ్వర్ సింగ్ (సౌరభ్ శుక్లా) నివాసంపై దాడి చేసి.. దేవాలయంలో దాచిన బ్లాక్ మనీని బయటకు తీసిన సంగతి మనకు గుర్తుండే ఉంటుంది. ఇప్పుడు రమేశ్వర్ సింగ్ జైల్లో ఉన్నా, అమయ్ తన 75వ రెయిడ్ కోసం సిద్ధమవుతున్నాడు. ఈసారి లక్ష్యం ఓ శక్తిమంతమైన రాజకీయ నాయకుడు. అతని పాత్రను రితేశ్ దేశ్‌ముఖ్ పోషిస్తున్నాడు.

ఈ చిత్రానికి రాజ్ కుమార్ గుప్తా దర్శకత్వం వహిస్తున్నారు. మొదటి ‘రెయిడ్’ సినిమాకూ ఆయనే దర్శకత్వం నిర్వహించారు. మే 1న సినిమా థియేటర్లలో విడుదల కానుంది. పనోరమా స్టూడియోస్ నిర్మించిన ఈ చిత్రంలో రాజత్ కపూర్, సుప్రియ పాఠక్, అమిత్ సియాల్ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.

ఈ సినిమా నిర్మాతలుగా భూషణ్ కుమార్, కుమార్ మంగత్ పాఠక్, అభిషేక్ పాఠక్, కృష్ణన్ కుమార్ ఉన్నారు. టీ-సిరీస్ సంస్థ ఈ చిత్రాన్ని ప్రెజెంట్ చేస్తోంది. అసలు ఈ సినిమా 2024 నవంబర్ 15న విడుదల కావలసినప్పటికీ, పోస్ట్-ప్రొడక్షన్ పనుల కారణంగా విడుదల వాయిదా పడింది. ప్రస్తుతం విడుదలైన ట్రైలర్ చూస్తే, ‘రెయిడ్ 2’ మరో మోస్ట్ వాంటెడ్ అవినీతి కేసును ఛేదించే ప్రయాణంలా అనిపిస్తోంది. అసలు అమయ్ ఈసారి ఏ రహస్యాలను వెలికితీయనున్నాడో తెలుసుకోవాలంటే మే 1న థియేటర్‌కే వెళ్లాల్సిందే.

Tags

Next Story