మొదటి టాటూ వేయించుకున్న కృతి సనన్

త్రిష, శృతి హాసన్ లాంటి చాలా మంది హీరోయిన్స్.. తమ శరీరంపై మల్టిపుల్ టాటూలు వేయించుకుని వాటిని గర్వంగా ప్రదర్శిస్తుంటారు. కానీ బాలీవుడ్ స్టార్ కృతి సనన్ ఇప్పటివరకు ఈ ట్రెండ్‌కి దూరంగా ఉంది. అయితే తాజాగా.. ఆమె తన మొదటి టాటూని ఆవిష్కరించింది.
కృతి సనన్ తన చీలమండపై ఎగురుతున్న పక్షి రూపంలో అందమైన డిజైన్‌తో కూడిన టాటూ వేయించుకుంది. కృతి ఈ టాటూని ఇన్‌స్టాగ్రామ్‌లో ఫోటోలతో పంచుకుంది. దానితో పాటు ఒక కవితాత్మక నోట్ కూడా రాసింది. టాటూ వేయించుకోవాలని ఎప్పుడూ అనుకోలేదని.. కానీ ఇప్పుడు ఇది తనకు ఎంతో ఎత్తుకు ఎగరగలనని గుర్తు చేసే వ్యక్తిగత సంకేతంగా భావిస్తున్నట్లు చెప్పింది.
ధైర్యమైన అడుగులు వేయడానికి సంకోచించే వారికి ఆమె ప్రోత్సాహకరమైన మాటలు కూడా అందించింది.“కలలు కన్నవారికి నా సందేశం... భయపడుతున్న ఆ అడుగు వేయండి. అది సులభం కాకపోవచ్చు, కానీ మీరు మీ రెక్కలను కనుగొంటారు, మీ లయను కనుగొంటారు, ఎగరడం నేర్చుకుంటారు.. ” అని ఆమె రాసింది. కృతి సనన్ తెలుగులో మహేష్ బాబుతో “వన్ నేనొక్కడినే” సినిమాతో నటనా రంగంలోకి అడుగుపెట్టింది. ప్రభాస్‌తో కలిసి “ఆదిపురుష్” సినిమాలో కూడా నటించింది.
-
Home
-
Menu