ఆమిర్ ఖాన్ సూపర్ హిట్ చిత్రానికి సీక్వెల్ ?

ఇటీవలి సినిమా ట్రెండ్స్‌ను గమనిస్తే, భారతీయ సినిమా పరిశ్రమ పూర్తిగా సీక్వెల్స్ ఫ్రాంచైజ్ చిత్రాల సంస్కృతి వైపుకు మళ్ళుతున్నట్టు స్పష్టమవుతోంది. గత కొన్ని సంవత్సరాలుగా ఈ రకమైన చిత్రాలు బాక్స్ ఆఫీస్‌ను శాసిస్తూ, ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో, ఒక సరికొత్త సీక్వెల్ గురించి వార్తలు వినిపి స్తున్నాయి, అయితే ఈ సీక్వెల్ తెలుగు కాదు. మిస్టర్ పెర్ఫాక్షనిస్ట్ ఆమిర్ ఖాన్ తో తెరకెక్కించబోతున్న సూపర్ సీక్వెల్.
గతంలో ఆమిర్ ఖాన్, భారతీయ అత్యుత్తమ దర్శకుల్లో ఒకరైన రాజ్‌కుమార్ హిరానీ కాంబినేషన్ లో 'పీకే' అనే చిత్రం తెరకెక్కిన సంగతి తెలిసిందే. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద భారీ విజయాన్ని సాధించి.. అదిరిపోయే కలెక్షన్స్ రాబట్టింది. 'పీకే' సినిమా ఒక ప్రత్యేకమైన కథాంశం, హాస్యం, సామాజిక సందేశంతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఒక గ్రహాంతర వాసి భూమిపైకి వచ్చి, మానవ సమాజంలోని మతపరమైన, సామాజిక ఆచారాలను ప్రశ్నించే కథగా తెరకెక్కి అద్బుతమైన ప్రేక్షకాదరణ పొందింది.
ఇప్పుడు, నిర్మాతలు 'పీకే' చిత్రానికి సీక్వెల్ తీయాలనే ఆలోచనలో ఉన్నారని, ఈ సీక్వెల్‌కు సంబంధించిన ప్రాథమిక చర్చలు జరుగుతున్నాయని, ఈ ప్రాజెక్ట్‌కు ఆమిర్ ఖాన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని తెలుస్తోంది. ఈ వార్త సినీ అభిమానుల్లో భారీ అంచనాలను రేకెత్తిస్తోంది. ఎందుకంటే 'పీకే' వంటి ఐకానిక్ చిత్రానికి సీక్వెల్ అంటే ఖచ్చితంగా ఒక పెద్ద ఈవెంట్‌గా పరిగణించబడుతుంది.
మొదటి భాగంలోనే సీక్వెల్ ఆలోచనను చాలా చాకచక్యంగా నాటారు. 'పీకే' చిత్రం చివరలో, ఆమిర్ ఖాన్ తన అన్యగ్రహ గ్రహానికి తిరిగి వెళ్లే సన్నివేశంలో, మరో సూపర్‌స్టార్ రణబీర్ కపూర్ కీలక పాత్రలో కనిపించారు. ఈ సన్నివేశం సీక్వెల్‌కు ఒక బలమైన పునాదిని సిద్ధం చేసింది. రణబీర్ కపూర్ పాత్ర ఒక అన్యగ్రహ వాసిగా భూమిపైకి వచ్చే సూచనలు ఇవ్వడం ద్వారా, సీక్వెల్ కోసం ఒక ఆసక్తికరమైన కథాంశానికి తలుపులు తెరిచింది. మరి ఈ సీక్వెల్ ఎప్పుడు కార్యరూపం దాల్చుతుందో చూడాలి.
-
Home
-
Menu