‘మహాభారతం’ కొన్ని భాగాలుగా రూపొందుతుంది : ఆమిర్ ఖాన్

‘మహాభారతం’ కొన్ని భాగాలుగా రూపొందుతుంది : ఆమిర్ ఖాన్
X
ఈ సినిమా హాలీవుడ్ మాస్టర్ పీస్ ‘లార్డ్ ఆఫ్ ది రింగ్స్’ లాగా బహుళ భాగాలుగా రూపొందుతుందని అమీర్ వెల్లడించారు. అయితే, కథ రాయడానికే చాలా సంవత్సరాలు పట్టవచ్చని చెప్పారు.

బాలీవుడ్ సూపర్‌స్టార్ అమీర్ ఖాన్ భారతీయ ఇతిహాసం మహాభారతాన్ని సినిమాగా తీయాలనే తన కలను చాలాకాలంగా వ్యక్తం చేస్తున్నారు. తాజా ఇంటర్వ్యూలో.. ఈ ప్రాజెక్ట్‌ను ఈ ఏడాది ప్రారంభించేందుకు ఆయన సన్నాహాలు చేస్తున్నట్లు తెలిపారు. మీడియాతో మాట్లాడుతూ.. అమీర్ ఈ ఏడాది మహాభారతం పనులు మొదలుపెడతానని చెప్పారు. ఈ చిత్రాన్ని తన నిర్మాణ సంస్థ ద్వారా నిర్మిస్తానని తెలిపారు. “ఈ ఏడాది దీనిపై పని చేయాలని ఆశిస్తున్నాను,” అని ఆయన అన్నారు.

ఈ సినిమా హాలీవుడ్ మాస్టర్ పీస్ ‘లార్డ్ ఆఫ్ ది రింగ్స్’ లాగా బహుళ భాగాలుగా రూపొందుతుందని అమీర్ వెల్లడించారు. అయితే, కథ రాయడానికే చాలా సంవత్సరాలు పట్టవచ్చని చెప్పారు. ఈ చిత్రంలో తాను నటిస్తానా అనేది ఇంకా నిర్ణయించలేదని, పాత్రలకు తగిన నటులను ఎంచుకుంటామని అమీర్ తెలిపారు. అలాగే.. “మహాభారతాన్ని ఒకే సినిమాలో చెప్పలేము, కాబట్టి ఇది మల్టిపుల్ భాగాలుగా రూపొందుతుంది. దీనికి బహుశా మల్టిపుల్ డైరెక్టర్స్ కూడా అవసరం కావచ్చు,” అని అమీర్ చెప్పారు. ఈ ప్రాజెక్ట్ భారీ స్థాయిలో ఉంటుందని సూచించారు.

ప్రస్తుతం అమీర్ ఖాన్ తన కొత్త చిత్రం ‘సితారే జమీన్ పర్’లో నటిస్తున్నారు. ఇది 2007లో విడుదలైన ‘తారే జమీన్ పర్’ చిత్రానికి సీక్వెల్‌గా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ఆర్‌ఎస్ ప్రసన్న దర్శకత్వం వహిస్తున్నారు, జెనీలియా దేశ్‌ముఖ్ కథానాయికగా నటిస్తున్నారు. అమీర్ ఖాన్ అండ్ కిరణ్ రావు నిర్మించిన ఈ చిత్రం జూన్ 20న విడుదల కానుంది.

Tags

Next Story